అల్వాల్ కారు బీభత్సం ఘటనలో యువకుడు మృతి
TeluguStop.com
హైదరాబాద్ అల్వాల్ లో కారు బీభత్సం సృష్టించిన ఘటనలో గాయపడిన యువకుడు చనిపోయాడు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా.మరో వ్యక్తి రాజ్ కుమార్ కు చికిత్స కొనసాగుతోంది.
మృతుడు స్విగ్గి డెలివరీ బాయ్ రాజుగా గుర్తించారు.ఈ క్రమంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
అయితే కానజిగూడలో వేగంగా వచ్చిన కారు రెండు బైకులతో ఢీకొట్టింది.తరువాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది.
కాగా తిరుమలగిరి నుంచి కానజిగూడ వైపుగా వస్తున్న కారును శివాని అనే సాప్ట్ వేర్ ఇంజినీర్ అతివేగంగా నడిపినట్లు పోలీసులు గుర్తించారు.
వీడియో వైరల్: ఒకే వేదికపై సచిన్, వినోద్ కాంబ్లీ.. సచిన్‌ను చూడగానే?