వైరల్ వీడియో: ప్రభుత్వ కారులో చక్కర్లు కొడుతున్న యువత..?

ఉత్తరప్రదేశ్‌ లోని ఘజియాబాద్( Ghaziabad ) నుండి ఒక వీడియో వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో కొందరు వ్యక్తులు ప్రభుత్వ వాహనంలో( Government Vehicle ) విన్యాసాలు చేస్తూ కనిపించారు.

ఒకరు కారులో వేలాడుతూ ఉండగా.మరొకరు కారు నడుపుతున్నారు.

మరో వ్యక్తి దాని వీడియోను రికార్డ్ చేయడంతో అది వైరల్‌గా మారింది.ఈ వీడియో ఘజియాబాద్‌ లోని విజయ్ నగర్‌కు చెందినదని చెబుతున్నారు.

ఈ వీడియోలో ఎవరైనా అధికారి ఉన్నారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు.కారు విండ్ షీల్డ్‌పై మేజిస్ట్రేట్ అని రాసి ఉంది.

"""/" / దీనితో పాటు కారుపై ఎరుపు నీలం లైట్లు కూడా అమర్చబడి ఉన్నాయి.

హైవేపై నడుస్తున్న ఈ వాహనం కిటికీకి ఓ వ్యక్తి కూడా వేలాడుతున్నాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.ఇక కారుతో కొందరు యువకులు స్టంట్‌( Stunts ) చేస్తున్న దృశ్యాలు మాత్రం వీడియోలో రికార్డ్‌ అయ్యాయి.

హైవేపై వెళ్తున్న ఈ వాహనం విండోకు ఓ వ్యక్తి వేలాడుతున్న తీరు నిజంగా ప్రమాదకరంగా అగుపిస్తోంది.

"""/" / ఇక ఈ వీడియో చుసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.ఇందులో భాగంగా ప్రభుత్వ పెద్దలే ఇలా చేస్తే.

ఇక మాములు ప్రజలను ఎలా ఆపుతారంటూ ప్రశ్నిస్తున్నారు.మరికొందరైతే సామాన్యులకు మాత్రమే చట్టమా.

ఇలాంటి వారికీ ఉండదా.? అని కామెంట్ చేసారు.

ఇంకొందరైతే ఈ వాహనానికి కూడా చలానా వేస్తారా.? అని ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి వీడియో చుసిన నెటిజన్స్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.ఇలాంటి వారిపై పోలీసులు( Police ) గట్టిగా చర్యలు తీసుకుంటేనే ఇలాంటి పనులు మళ్లీ చేయరంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ హీరో రూపాయి కూడా తీసుకోలేదు.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి: దిల్ రాజు