ఈ న్యాచురల్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ గ్లో..!
TeluguStop.com
తమ ముఖ చర్మం సూపర్ గ్లోయింగ్ గా మెరిసిపోతూ కనిపించాలని ఆడవారు ఎంతగానో కోరుకుంటారు.
అటువంటి చర్మాన్ని పొందడానికి రకరకాల స్కిన్ కేర్ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.
నెలకు ఒకసారైనా బ్యూటీ పార్లర్ కు వెళ్లి స్కిన్ కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
కానీ పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే సూపర్ గ్లోయింగ్ స్కిన్ ( Super Glowing Skin )ను మీ సొంతం చేసుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ నైట్ క్రీమ్ ఉత్తమంగా సహాయపడుతుంది. """/" /
అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో పీల్ తొలగించిన మూడు బీట్ రూట్ స్లైసెస్( Beet Root Slices ), గుప్పెడు ఫ్రెష్ గులాబీ రేకులు( Fresh Rose Petals ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, ( Aloe Vera Gel )వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ) , హాఫ్ టీ స్పూన్ బాదం ఆయిల్ వేసుకొని ఐదు నిమిషాల పాటు స్పూన్ సహాయంతో మిక్స్ చేస్తే మన క్రీమ్ అనేది రెడీ అవుతుంది.
"""/" /
ఒక బాక్స్ లో ఈ క్రీమ్ ను నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
ప్రతిరోజు నైట్ నిద్రించే ముందు ఈ న్యాచురల్ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
రెగ్యులర్ గా ఈ క్రీమ్ ను కనుక వాడితే చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది.
అందంగా మెరుస్తుంది.పొడి చర్మం సమస్య దూరం అవుతుంది.
స్కిన్ హైడ్రేట్ గా ఉంటుంది.అలాగే ఈ క్రీమ్ స్కిన్ కలర్ ను ఇంప్రూవ్ చేస్తుంది.
పిగ్మెంటేషన్ సమస్యను దూరం చేస్తుంది.కాబట్టి అందమైన మెరిసే చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న క్రీమ్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!