ఈ కాఫీ మాస్క్ తో మీ జుట్టు అవుతుంది డ‌బుల్‌..!

కాఫీ( Coffee ) అంటేనే ఒక ఎమోష‌న్ అనేవాళ్లు ఎంద‌రో ఉన్నారు.ఉద‌యం లేవ‌గానే వేడి వేడిగా ఒక క‌ప్పు కాఫీ తాగితే వ‌చ్చే అనుభూతి మాట‌ల్లో వ‌ర్ణంచ‌డం క‌ష్ట‌మే.

కాఫీ వ‌ల్ల ఆరోగ్య ప‌రంగా ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి అన్న‌ది ప‌క్క‌న పెడితే.

కురుల సంక్ష‌ణ‌కు మాత్రం కాఫీ పౌడ‌ర్ చాలా బాగా స‌హాయ‌ప‌డుతుంది.ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే కాఫీ మాస్క్ ను ప్ర‌య‌త్నిస్తే మీ జుట్టు డ‌బుల్ అవ్వ‌డం ఖాయం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా పడిన ఒక అరటి పండును స్లైసెస్( Slices The Banana ) గా కట్ చేసి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న అరటిపండు మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ ( Coffee Powder )మరియు రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి. """/" / కాఫీలో కెఫిన్ ( Caffeine )ఉంటుంది, ఇది హెయిర్ ఫోలికల్స్‌ను ఉత్తేజపరుస్తుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్స‌హిస్తుంది.కాఫీ స్కాల్ప్‌ను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.

డెండ్రఫ్, ఇన్ఫెక్షన్స్( Dandruff, Infections ) వంటి సమస్యలను స‌మ‌ర్థ‌వంతంగా నివారిస్తుంది.కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్ ఫాల్‌, హెయిర్ డ్యామేజ్ ను అరిక‌డ‌తాయి.

అలాగే అర‌టి పండు విటమిన్ బి6 మరియు పీటాషియం వంటి పోష‌కాల‌ను అందించి జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరిగేందుకు స‌హాయ‌ప‌డుతుంది.

"""/" / అర‌టి పండులో ఉండే పొటాషియం జుట్టు తంతువులను బలోపేతం చేస్తుంది.

అర‌టి పండు జుట్టులో మాయిశ్చర్‌ని నిలుపుకునేందుకు, కురుల‌ను మృదువుగా మరియు కాంతివంతంగా మెరిపించేందుకు తోడ్ప‌డుతుంది.

పొడి జుట్టు స‌మ‌స్య‌ను నివారిస్తుంది.ఇక ఆలివ్ ఆయిల్ కూడా కురుల సంర‌క్ష‌ణ‌కు మ‌ద్ద‌తు ఇస్తుంది.

కాబ‌ట్టి, డ‌బుల్ అండ్ హెల్తీ హెయిర్ ను కోరుకునేవారు త‌ప్ప‌కుండా ఆ కాఫీ బ‌నానా మాస్క్ ను ప్ర‌య‌త్నించండి.

ఆ విషయంలో నేను నిరాశకు గురయ్యాను.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు వైరల్!