దారుణం : యువతి శీలం రేటు కేవలం రూ.2 లక్షలు మాత్రమేనట…
TeluguStop.com
ప్రస్తుత కాలంలో కొందరు డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు చేసేటటువంటి పనులకి అమాయకులు బలవుతున్నారు.అలాగే కొందరు గ్రామ పెద్దలనే ముసుగు తగిలించుకుని గ్రామంలోని ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటూ దారుణాలకు పాల్పడుతున్నారు.
తాజాగా కొందరు గ్రామ పెద్దలు యువతి శీలానికి 2 లక్షల రూపాయలు వెలకట్టిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందినటువంటి ఓ గ్రామంలో ఓ యువతి ఇటీవలే యువకుడి చేతిలో అత్యాచారానికి గురైంది.
దాంతో యువకుడి కుటుంబ సభ్యులు ఈ విషయం పోలీసుల వరకు వెళితే కుటుంబ పరువు మరియు యువకుడి జీవితం నాశనం అవుతుందని భావించి గ్రామంలోని పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు.
అయితే ఈ పంచాయతీలో గ్రామ పెద్దలు యువతిపై యువకుడు అత్యాచారానికి పాల్పడినందుకుగాను దాదాపు 2 లక్షల రూపాయలు యువతికి నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
అయితే నష్ట పరిహారం చెల్లించేందుకు అంగీకరించినటువంటి యువకుడి తల్లిదండ్రులు కొందరు పంచాయతీ పెద్దలకు నష్టపరిహారం రెండు లక్షల రూపాయలను యువతికి ఇవ్వాలని కోరుతూ చెల్లించారు.
దీంతో గ్రామ పెద్దలు నష్టపరిహార సొమ్మును బాధితురాలికి ఇవ్వకుండా మొత్తం సొమ్ము కాజేశారు.
దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అంతేగాక పలువురు నెటిజన్లు గ్రామ పెద్దలమని చెప్పుకుంటూ యువతికి చేసినటువంటి అన్యాయానికి గానూ పోలీసులు వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అలాగే బాధితురాలిపై త్యాచారం చేసి ఆ తప్పుని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేసినటువంటి యువకుడిని మరియు అతడి తల్లిదండ్రులను అరెస్టు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి18, శనివారం 2025