పిల్లిగా మారాలని యువతి షాకింగ్ నిర్ణయం.. వీడియో చూస్తే గుండె గుబేల్..

విదేశాల్లో నివసించే ప్రజల కోరికలు వింటే షాక్ అవ్వక తప్పదు.వారు బార్బీ గర్ల్‌( Barbie Girl )గా మారాలని ఏవేవో సర్జరీలు చేయించుకుంటారు.

శరీరం అంతటా టాటూలు పొడిపించుకుంటారు.కొందరు జంతువుల్లాగా మారేందుకు కూడా ప్రయత్నిస్తారు.

ఇటీవల ఒక వ్యక్తి చాలా డబ్బులు పెట్టి కుక్కలాగా మారిన సంగతి తెలిసిందే.

ఆ కోవకు చెందిన ఒక యువతి తాజాగా పిల్లిగా మారడానికి ప్రయత్నిస్తోంది.ఇప్పటికే చాలా వరకు పిల్లిగా ఆమె మారిపోయింది.

"""/" / వివరాల్లోకి వెళ్తే, చియారా డెల్'అబేట్( Chiara Dell Abate ), ఐడిన్ మోడ్ అని కూడా పిలిచే 22 ఏళ్ల ఇటాలియన్ మహిళ, హ్యూమన్ క్యాట్ కావాలని కలలుకంటున్నది.

ఆమె కోరుకున్న రూపాన్ని సాధించడానికి 20 విభిన్న బాడీ ట్రాన్స్‌ఫర్‌మేషన్స్‌కి గురైంది.ఆమె టిక్‌టాక్‌లో తన క్యాట్ లుక్ వీడియోలను పంచుకుంది, అక్కడ అవి వైరల్‌గా మారాయి.

ఆమె నాసికా రంధ్రాలు, పై పెదవి, లోపలి లాబియాతో సహా శరీరంలోని వివిధ భాగాలపై 72 కంటే ఎక్కువ కుట్లు ఉన్నాయి.

తన నాలుకను కూడా రెండు ముక్కలు చేసింది. """/" / "నేను చాలా కూల్ క్యాట్ లేడీగా ఉంటానని అనుకుంటున్నాను" అని ఆమె మీడియాతో చెప్పుకొచ్చింది.

తన 11వ ఏట తొలి కుట్లు వేయించుకుని తన ప్రయాణాన్ని ప్రారంభించానని చెప్పింది.

కనురెప్పల నుంచి అదనపు చర్మాన్ని తొలగించడానికి కనుబొమ్మలపై పచ్చబొట్లు, నుదిటిపై ఇంప్లాంట్లు చేయించుకుంది.

చెవులను కత్తిరించడానికి కాస్మోటిక్ శస్త్రచికిత్స కూడా చేయించుకుంది.ఆమె శాశ్వత ఐలైనర్, పంజా లాంటి గోళ్లను ధరిస్తుంది.

తనకు పిల్లులంటే ఇష్టమని, కార్టూన్ క్యారెక్టర్ లా కనిపించడం ఇష్టంలేక క్యాట్ లేడీగా మారాలని ఎంచుకున్నానని చెప్పింది.

సరైన బాడీ మోడ్స్‌తో బోల్డ్‌గా, ఫియర్‌లెస్‌గా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది.ఆమె తన పిల్లిలాంటి రూపాన్ని పూర్తి చేయడానికి మరిన్ని ప్రయత్నాలు చేయాలని యోచిస్తోంది.

తనకు పిల్లి కళ్లు లిఫ్ట్, దంతాల రీషేపింగ్, ఎగువ పెదవి కట్, మరిన్ని ఫిల్లర్లు, తోకను జోడించడానికి ట్రాన్స్‌డెర్మల్ ఇంప్లాంట్ అవసరమని ఆమె చెప్పింది.

ఆమెకు మరిన్ని టాటూలు( Tattoos ) కూడా కావాలట.ఆమె ట్రాన్స్‌ఫర్‌మేషన్‌కు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి.

కొందరు ఆమెను "సైకోటిక్", "డిస్టర్బ్డ్" అని విమర్శించారు.మరికొందరు ఆమె స్వేచ్ఛగా జీవిస్తున్నారని, తనకు నచ్చినట్లు బతుకుతుంది అని అన్నారు.

ఐకాన్ స్టార్ బన్నీకి 2025 సంవత్సరం కలిసొస్తోందా.. ఆ విధంగా సక్సెస్ అవుతున్నారుగా!