డిప్రెషన్ కు గురై యువతి ఆత్మహత్య.. ఫోటోలకు లైక్ కొట్టలేదనే !
TeluguStop.com
ప్రస్తుతం యువత సోషల్ మీడియా అంటూ, ఆన్ లైన్ గెమ్స్ అంటూ భవిష్యత్ ను మట్టిపాలు చేసుకుంటున్నారు.
విద్యాబుద్ధులను ఏనాడో మరిచారు.పిల్లలకు తగ్గట్లుగా తల్లిదండ్రులు తయారయ్యారు.
ఎక్కడ తిడితే, కొడితే ఏ అఘాయిత్యానికి పాల్పడుతారో తెలియని పరిస్థితి.అయినా కొందరు యువతి యువకులు సోషల్ మీడియా, ఆన్ లైన్ గేమ్ లే జీవితంగా భావిస్తూ బతుకుతున్నారు.
ఆన్ లైన్ గేమ్ లు ఆడి ప్రాణాలు కోల్పోయే యువత, సోషల్ మీడియాలో వేధింపులకు గురయ్యే యువతులను చూస్తునే ఉంటున్నాం.
కానీ ఓ యువతి సోషల్ మీడియాలో తన ఫోటోలకు లైకులు రావడం లేదని ఆత్మహత్య చేసుకుంది.
ఇంగ్లండ్ దేశంలోని లాంచెస్టర్ నగరంలో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.ఫేస్ బుక్ కి బానిసైన 19 ఏళ్ల క్లోయె ఆత్మహత్య చేసుకుంది.
అయితే చనిపోయినప్పుడు మరణానికి సంబంధించి ఎలాంటి కారణాలు, ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు నార్మల్ డెత్ గా ప్రకటించారు.
కానీ కొద్ది రోజుల తర్వాత తన స్నేహితురాలు అసలు విషయం చెప్పడంతో పోలీసులు షాక్ కి గురయ్యారు.
క్లోయె తరచూ ఫోటోలు దిగి ఫేస్ బుక్ లో అప్లోడ్ చేసేదని, ఆ ఫోటోలకు లైకులు రాకపోవడంతో డిప్రెషన్ కి లోనై ఆత్మహత్య చేసుకుందని తెలిపింది.
దీంతో కుటుంబ సభ్యులు, క్లోయె తల్లి తీవ్ర ఆవేదన చెందారు.సామాజిక మాధ్యమాలను నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరారు.
జనసేన లోకి వారంతా క్యూ … టీడీపీ నేతల్లో ఆగ్రహం ?