ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు.. కార‌ణం తెలిస్తే షాక‌వ్వాల్సిందే!

దేశంలో అమ్మాయిలు, మహిళలపై యాసిడ్ దాడులు చేస్తున్న సంఘటనలు ఎప్ప‌టిక‌ప్పుడు చూస్తూనే ఉన్నాం.

ఈ యాసిడ్ దాడుల వ‌ల్ల ఎంద‌రో ఆడ‌వాళ్లు అంధ‌కారంలోకి వెళ్లిపోయారు.ప్రేమించ‌లేద‌నో, కోరిక తీర్చ‌లేద‌నో, మోసంచేశార‌నో.

ఇలా ఏదో ఒక కార‌ణంతో కొంద‌రు మ‌గ‌వాళ్లు మాన‌వ‌త్వం మ‌ర‌చి యాసిడ్ దాడులు చేస్తూ.

ఆడవాళ్ళ జీవితాలను నిలువునా ముంచేస్తున్నారు.అయితే ఇందుకు భిన్నంగా ఓ ప్రియురాలు.

ప్రియుడిపై యాసిడ్ దాడి చేసింది.ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.కర్నూలు జిల్లా నంద్యాల మండలం పెద్ద కొట్టాలలో నాగేంద్ర అనే యువ‌కుడు ఓ యువ‌తిని ప్రేమించాడు.

ఇద్ద‌రూ పెళ్లి కూడా చేసుకోవాల‌నుకున్నారు.కానీ, వీరిద్ద‌రి కులాలు వేరు కావ‌డంతో.

పెళ్లికి పెద్ద‌లు ఒప్పుకోలేదు.దీంతో నా‌గేంద్ర గ‌త నెల‌లో మ‌రో యువ‌తిని పెళ్లాడాడు.

త‌నను ప్రేమించి.వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవ‌డం జీర్ణించుకోలేని ప్రియురాలు కోపంతో ర‌గిలిపోయింది.

ఈ క్ర‌మంలోనే నా‌గేంద్ర‌పై యాసిడ్ దాడి చేసింది.ఈ దాడిలో నాగేంద్ర తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.

దీంతో వెంట‌నే నాగేంద్ర‌ను స్థానిక హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించారు.ప్ర‌స్తుతం నాగేంద్ర‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

కాగా, నాగేంద్రపై స‌ద‌రు యువతి యాసిడ్ దాడి చేయడం రెండోసారి కావ‌డం గ‌మ‌నా‌ర్హం.

గ‌త వారం దాడి చేసిన‌ప్పుడు.నాగేంద్ర చేయిపై యాసిడ్ ప‌డింది.

ఆ గాయం మాన‌క‌ముందే.రెండోసారి దాడి చేయ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది.

మ‌రోవైపు నాగేంద్ర త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.విచార‌ణ చేప‌ట్టారు.

తారక్ పేరెత్తడానికి కూడా ఇష్టపడని బాలకృష్ణ.. తమ హీరో అంత తప్పేం చేశాడంటూ?