మా ఎన్నికల్లో ఓటు వేయనని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. ఏమైందంటే?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 10వ తేదీన జరగనున్నాయి.ప్రకాష్ రాజ్, విష్ణు మధ్య పోటీ ఉండటంతో ఎవరు గెలుస్తారనే చర్చ జరగడంతో పాటు ఎన్నికల తర్వాత సైతం ప్రకాష్ రాజ్, విష్ణు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అటు ప్రకాష్ రాజ్ ఇటు విష్ణు ఎన్నికల్లో తాము ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రకాష్ రాజ్ కు చిరంజీవి సపోర్ట్ ఉండగా విష్ణుకు బాలకృష్ణ, సీనియర్ నరేష్, కృష్ణ, కృష్ణంరాజు సపోర్ట్ చేస్తున్నారు.

అయితే తాజాగా జీవితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్ల గురించి చెప్పుకొచ్చారు.

జీవితా రాజశేఖర్ ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నారనే విషయం తెలిసిందే.

తాను ఇటీవల ఒక పార్టీలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను కలిశానని జీవిత అన్నారు.

ఎన్టీఆర్ ను తనకు ఓటు వేయాలని కోరగా ప్రస్తుత పరిస్థితులపై తారక్ అసహనం వ్యక్తం చేశారని జీవిత తెలిపారు.

"""/"/ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వల్ల నెలకొన్న పరిస్థితులను చూస్తే తనకు బాధ కలుగుతోందని ఎన్టీఆర్ అన్నారని జీవిత తెలిపారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు వేయడానికి రానని ఎన్టీఆర్ చెప్పాడని జీవిత వెల్లడించారు.

ఇకపై తనను ఓటు కూడా అడగవద్దని ఎన్టీఆర్ జీవితకు చెప్పారని సమాచారం.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా అనేక వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.

"""/"/ ఎన్నికల్లో తమదే విజయమని మా సత్తాతోనే ఎన్నికలలో విజయం సాధిస్తామని జీవిత కామెంట్లు చేశారు.

ఎన్టీఆర్ కామెంట్లు చేసిన విధంగానే ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని జీవిత వెల్లడించడం గమనార్హం.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రాంతీయవాదాన్ని తీసుకొనిరావద్దని జీవిత కోరడం గమనార్హం.

సొంత సినిమాలనే డైరెక్ట్ చేసుకుంటే వాటి పరిస్థితి ఇలాగే ఉంటుంది.