వీరాభిమాని ఆహ్వాన పత్రికని స్వీకరించిన స్టార్ హీరో.. ఎవరంటే?

సినీ ఇండస్ట్రీలో నటీనటులు ఎంతో బిజీగా ఉంటారు.ఇక స్టార్ హీరోలయితే.

తీరిక సమయం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉంటుంటారు.అలాంటిది వీళ్లకు బయట గడిపేంత సమయం కూడా ఉండలేకపోతుంది .

అంతేకాకుండా తమ కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి కూడా తీరిక లేకుండా ఉంటారు.

అలాంటిది కొందరు స్టార్ హీరోలు తమ అభిమానులను కలవడానికి సమయాన్ని కూడా ఇస్తుంటారు.

ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, నాగార్జున ఇలా తమ అభిమానులను కొన్ని సందర్భాలలో కలిసిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా మరో స్టార్ హీరో కూడా ఏకంగా తన వీరాభిమాని ఆహ్వాన పత్రికనే స్వీకరించారు.

ఇంతకీ ఆయన ఎవరో కాదు.యంగ్ టైగర్ ఎన్టీఆర్.

ఈయనకు తన నటన పట్ల, వ్యక్తిగత విషయం పట్ల విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

"""/"/ అంతేకాకుండా అభిమానులలో కొన్ని అభిమానుల అసోసియేషన్ సంఘాలు కూడా ఉంటాయి.ఇదిలా ఉంటే తాజాగా ఓ అభిమాని సంఘానికి ప్రెసిడెంట్ అయిన భాస్కర్ చౌదరి, తమ అభిమాన హీరో ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు.

ఆయనకు పెళ్లి కార్డు ఇచ్చి కాసేపు సమయాన్ని గడిపాడు.అంతేకాకుండా ఎన్టీఆర్ తో కలిసి తమ కుటుంబం దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో చేర్చగా ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల కానుంది.అంతేకాకుండా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు.

అంతేకాకుండా బుల్లితెరలో ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షోలో కూడా హోస్టింగ్ చేయనున్నట్లు తెలిసిందే.

ఒక్క‌సారిగా చ‌క్కెర తీసుకోవ‌డం మానేస్తే శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా?