బెస్ట్ యాక్టర్ గా ఎన్టీఆర్ కు సైమా అవార్డ్.. నా అభిమాన సోదరులందరికీ పాదాభివందనం అంటూ?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కి గతేడాది థియేటర్లలో విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ( RRR ) సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో రామరాజు పాత్రలో చరణ్, భీమ్ పాత్ర( Bheem Role )లో తారక్ అద్భుతంగా నటించారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ దక్కడం గమనార్హం.సైమా వేడుకల్లో తారక్ కు బెస్ట్ యాక్టర్ అవార్డ్( SIIMA Best Actor Award ) దక్కడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

"""/"/ తారక్ ప్రతిభకు మరో అవార్డ్ దక్కిందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

కొమురం భీమ్ పాత్రలో అద్భుతమైన నటన వల్లే తారక్ కు ఈ అవార్డ్ సొంతమైందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అవార్డ్ అందుకున్న తర్వాత తారక్ మాట్లాడుతూ అభిమానులు అందరికీ ధన్యవాదాలు అని కామెంట్ చేశారు.

నేను ఒడిదొడుకులలో ఉన్న సమయంలో కిందపడ్డ సమయంలో నన్ను పట్టుకుని పైకి లేపినందుకు థాంక్స్ అని తారక్ అన్నారు.

నా అభిమాన సోదరులందరికీ పాదాభివందనం అంటూ తారక్ ఇచ్చిన స్పీచ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

మళ్లీ మళ్లీ నన్ను నమ్మిన నా జక్కన్నకు థాంక్స్ అంటూ తారక్ కామెంట్లు చేశారు.

ప్రస్తుతం దేవర సినిమా( Devara Movie )లో యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) నటిస్తుండగా ఈ సినిమాతో తారక్ కు మరిన్ని అవార్డులు ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా కావడం గమనార్హం.

"""/"/ ఎలాంటి పాత్రలో అయినా తారక్ ప్రాణం పెట్టి నటిస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

తర్వాత సినిమాలతో తారక్ చరిత్ర సృష్టించే విజయాలను సొంతం చేసుకోవడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమాలన్నీ 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

ఈ సినిమాలన్నీ భారీ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ట్రంప్ ఆ ప్లాన్‌ ప్రకటించగానే.. నవ్వు ఆపుకోలేకపోయిన హిల్లరీ క్లింటన్!