దేవర మూవీ ట్రైలర్ రివ్యూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారుగా!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా నుంచి ట్రైలర్ తాజాగా విడుదలైంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశలను నిలబెట్టేలా, ఫ్యాన్స్ అంచనాలను ఎన్నో రెట్లు పెంచేలా న భూతో న భవిష్యత్ అనేలా దేవర ట్రైలర్ ఉంది.

"రక్తంతో సంద్రం ఎరుపెక్కిన కథ" అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ 2 నిమిషాల 40 సెకన్ల నిడివితో ఉంది.

"""/" / చాలారోజుల నుంచి ప్రచారం జరుగుతున్న విధంగానే తారక్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు.

"మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు కాదూ కూడదని మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా" అనే డైలాగ్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది.

ఎన్టీఆర్ కొడుకు పాత్రలో పిరికివాడిగా కనిపించడం గమనార్హం. """/" / ట్రైలర్ లో కొన్ని విజువల్స్ న భూతో న భవిష్యత్ అనేలా ఉన్నాయి.

భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే ఈరోజు నుంచి మీకు కానరాని భయం అవుతానంటూ తారక్ చెప్పిన డైలాగ్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది.

ట్రైలర్ వ్యూస్ పరంగా, లైక్స్ పరంగా అదరగొడుతోంది.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ట్రైలర్ లో ఎక్కువగానే ఉన్నాయి.

కొరటాల శివ ( Koratala Shiva )మ్యాజిక్ ఈసారి పని చేసే విధంగానే ఉంది.

ట్రైలర్ లో అనిరుధ్ బీజీఎం నెక్స్ట్ లెవెల్ లో ఉంది.ఈ నెల 27వ తేదీ బాక్సాఫీస్ మోత మోగడం పక్కా అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )డైలాగ్ డెలివరీ సైతం సెట్ అయింది.

ఒకే ఫ్రేమ్ లో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

నెలసరి క్రమం తప్పకుండా రావాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!