ఏపీలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పిన ఎన్టీఆర్.. ఆయన నమ్మకం నిజమవుతుందా?
TeluguStop.com
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr )ఒకప్పుడు టీడీపీ తరపున ప్రచారం చేసినా ఇప్పుడు మాత్రం ఏ పార్టీకి అనుకూలంగా కామెంట్లు చేయడం లేదు.
మీడియాకు కూడా గత కొంతకాలంగా తారక్ దూరంగా ఉంటున్నారు.ఆర్.
ఆర్.ఆర్ ప్రమోషన్స్ పూర్తైన తర్వాత తారక్ మీడియాను కలిసిన సందర్భాలు చాలా అరుదు అనే సంగతి తెలిసిందే.
అయితే పొలిటికల్ అంశాలపై తారక్ కు ఎంతో అవగాహన ఉంది. """/" /
ఏ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో అంచనా వేయడంలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎవరూ సాటిరారని తెలుస్తోంది.
తన సన్నిహితులతో రాజకీయాల గురించి ముచ్చటించే తారక్ తన సన్నిహితులతో గతంలో తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వస్తుందని చెప్పగా ఆయన చెప్పింది నిజమైందట.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు రిలీజ్ కావడానికి ముందే కాంగ్రెస్( Congress ) అధికారంలోకి వస్తుందని తారక్ చెప్పారట.
"""/" /
తెలంగాణ విషయంలో తారక్ లెక్కలు నిజం కావడంతో ఆయన సన్నిహితులు ఎంతో ఆశ్చర్యపోయారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఏపీలో సైతం తెలుగుదేశం అధికారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందని సన్నిహితులతో అన్నారట.
సోషల్ మీడియా( Social Media ) వేదికగా ఈ విషయం తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
ఏపీ విషయంలో తారక్ నమ్మకం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది.2019 సంవత్సరంలో టీడీపీ( TDP )కి భారీ షాకులు తగలగా 2024 సంవత్సరంలో ఏ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది.
ఏపీలో వార్ వన్ సైడ్ అవుతుందని ఇప్పుడే చెప్పలేమని రెండు పార్టీలు ప్లస్, మైనస్ పాయింట్లు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చూడాల్సి ఉంది.ఏపీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే ప్రశ్నకు సమాధానంగా వేర్వేరు సర్వేలు వెలుగులోకి వస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ విషయానికి వస్తే తారక్ క్రేజీ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.
ధనరాజ్ దగ్గర చిల్లిగవ్వ లేకపోతే బంగారం ఇచ్చేశా.. ధనరాజ్ భార్య షాకింగ్ కామెంట్స్!