ఎన్టీఆర్ కు కోపం వచ్చినా బాధ వచ్చినా అలా చేస్తాడా.. మామూలోడు కాదంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) సెట్స్ లో చాలా సరదాగా ఉంటారని బాగా అల్లరి చేస్తారని ఆయనతో పని చేసిన వాళ్లు చెబుతారనే సంగతి తెలిసిందే.

తారక్ డైలాగ్స్ ఎప్పుడు ప్రిపేర్ అవుతారో కూడా అర్థం కాదని షాట్ మొదలైతే సింగిల్ టేక్ లో పూర్తి చేస్తాడని ఆయనతో పని చేసిన దర్శకులు చెబుతున్నారు.

ఈతరం స్టార్ హీరోలలో కొన్ని విషయాలకు సంబంధించి ఎన్టీఆర్ కు ఎవరూ సాటిరారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

"""/"/ అయితే తారక్ కు కోపం వచ్చినా బాధ వచ్చినా తట్టుకోలేమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

సాధారణంగా మనలో ఎవరైనా కోపం, బాధ వస్తే ఆ సమయంలో ఇతరులతో మాట్లాడటానికి అస్సలు ఇష్టపడరు.

అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం కోపం, బాధ వస్తే కిచెన్ లోకి వెళ్లి తనకు నచ్చిన ఆహారాన్ని వండుకుని తినేస్తాడట.

కోపం, బాధ కలిగిన సమయంలో వండటం( Cooking ) మొదలుపెడితే మనస్సు డైవర్ట్ అవుతుందని ఆయన భావిస్తారట.

వంట పూర్తై తినే సమయానికి కోపం, బాధ తగ్గి కూల్ అవుతారట.ఈ టెక్నిక్ భలే ఉందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కోపం, బాధ వచ్చిన సమయంలో ఇతరులపై ఆ కోపాన్ని, బాధను ప్రదర్శించకుండా ఈ విధంగా చేయడమే ఉత్తమమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్ట్( NTR Koratala Shiva ) మూడో షెడ్యూల్ షూటింగ్ లో ఎన్టీఆర్ ప్రస్తుతం పాల్గొంటున్నారనే సంగతి తెలిసిందే.

"""/"/ తారక్ కెరీర్ తొలినాళ్లలో ఎంత వేగంగా సినిమాలను పూర్తి చేశారో ఈ సినిమాను కూడా అంతే వేగంగా పూర్తి చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

తారక్ కు ప్రముఖ ఇంటర్నేషనల్ కంపెనీల యాడ్స్ లో కూడా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది.

ఒకవైపు హీరోగా మరోవైపు యాడ్స్ లో నటిస్తూ తారక్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

బాలయ్యతో సినిమా తీయాలన్న దిల్ రాజు కల నెరవేరనుందా.. అలాంటి ప్రాజెక్ట్ సెట్ చేశారా?