ఆ ఆరేళ్లు నరకం అనుభవించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అన్ని కష్టాలా?
TeluguStop.com
ప్రతి ఒక్కరి జీవితంలో కొంతకాలం బ్యాడ్ టైమ్ నడుస్తుంది.ఆ సమయంలో ఏ పని చేసినా అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో కూడా 2009 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు బ్యాడ్ టైమ్ కొనసాగింది.
ఆ ఆరేళ్లలో జూనియర్ ఎన్టీఆర్ ఇటు సినీ కెరీర్ పరంగా అటు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
2009 సంవత్సరంలో టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్టీఆర్ యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో డాక్టర్లు తారక్ డ్యాన్స్ కు దూరంగా ఉంటే మంచిదని ప్రచారం చేశారు.
అయితే తారక్ మాత్రం సినిమాలపై ఉండే ఇష్టంతో డ్యాన్స్ ను వదిలిపెట్టలేదు.తారక్ ప్రచారం చేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తారక్ కు వ్యతిరేకంగా కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
"""/"/
ఈ ప్రచారం తారక్ ను మరింత బాధించిందని తారక్ సన్నిహితులు చెబుతారు.
2010 సంవత్సరంలో తారక్ అదుర్స్, బృందావనం సినిమాలతో విజయాలను అందుకున్నా ఈ సినిమాలు రికార్డులు క్రియేట్ చేసే స్థాయి విజయాలు కాకపోవడం ఫ్యాన్స్ ను ఒకింత హర్ట్ చేసింది.
2010 సంవత్సరంలో తారక్ లక్ష్మీ ప్రణతి మ్యారేజ్ ఫిక్స్ కాగా లక్ష్మీ ప్రణతి మైనర్ అని కథనాలు వినిపించాయి.
ఈ కథనాల వల్ల లక్ష్మీ ప్రణతి మేజర్ అయిన తర్వాతే తారక్ లక్ష్మీ ప్రణతి వివాహం జరిగింది.
2011 సంవత్సరంలో తారక్ కు శక్తి సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ చేరింది.
అదే ఏడాది విడుదలైన ఊసరవెల్లి ఫలితం కూడా తారక్ ను నిరాశకు గురి చేసింది.
దమ్ము సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆ సమయంలో మెసేజ్ ల ద్వారా ఈ సినిమా గురించి నెగిటివ్ ప్రచారం జరిగింది.
బాద్ షా తో సక్సెస్ సాధించిన తారక్ కు రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాల ఫలితాలు నిరాశకు గురి చేశాయి.
ఆ సమయంలో చంద్రబాబుకు తారక్ కు మధ్య గ్యాప్ వచ్చిందని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
ఒక న్యూస్ ఛానల్ తారక్ ఇమేజ్ కు డ్యామేజ్ చేసేలా కథనం ప్రచారంలోకి తెచ్చింది.
"""/"/
ఆ ఆరేళ్లు సంతోషంగా లేని తారక్ 2015లో విడుదలైన టెంపర్ సినిమా నుంచి తన గురించి ఎదురైన ప్రతి విమర్శకు సమాధానం చెబుతూ వచ్చారు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గ్లోబర్ హీరోలలో ఒకరిగా ఉన్నారు.ఇతర భాషల డైరెక్టర్లు సైతం తమ ఫేవరెట్ హీరో తారక్ అని తారక్ తో ఒక్క సినిమా తీసినా చాలని చెబుతున్నారు.
ఎదుగుతున్నా ఒదిగి ఉంటున్న తారక్ మరిన్ని విజయాలను సొంతం చేసుకుని కెరీర్ లో ఎంతో ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సమంత తండ్రి మరణించినా ఆమెను ఓదార్చని సెలబ్రిటీలు.. ఇది మరీ దారుణం!