అభిమాని గుండెపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఈ హీరోకు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Junior Ntr ) ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలు జరుగుతుండగా తారక్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది.

ఓటు హక్కును వినియోగించుకోవడం కోసమే తారక్ హైదరాబాద్ కు వచ్చినట్టు తెలుస్తోంది.ప్రతి ఎన్నికల్లో ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకుని తారక్ ఎంతోమందిలో స్పూర్తి నింపుతూ ఉంటారు.

"""/" / అయితే జూనియర్ ఎన్టీఆర్ ను ఒక అభిమాని ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరగా తారక్ ఆ అభిమాని గుండెలపై ఆటోగ్రాఫ్ ఇవ్వడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందేనని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఫ్యాన్ గుండెపై ఆటోగ్రాఫ్ ఇచ్చిన తారక్ తీరుకు ఫిదా అవుతున్నామని నెటిజన్లు చెబుతున్నారు.

"""/" / ఓటు వేసేందుకు వచ్చిన తారక్ బ్లూ షర్ట్ ధరించడం విషయంలో సైతం ఒకింత ఎక్కువగానే చర్చ జరుగుతోంది.

తారక్ వైసీపీకి మద్దతు( YCP )గా బ్లూ షర్ట్ ధరించాడని కొంతమంది కామెంట్ చేస్తుండగా వైసీపీకి ఫేవర్ గా ఉన్నవాళ్లు మాత్రమే ఈ విధంగా ఆలోచిస్తున్నారని ఎన్టీఆర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇచ్చారో కూడా క్లారిటీ లేదు.

జూనియర్ ఎన్టీఆర్ తటస్థంగా ఉండటంతో ఫ్యాన్స్ సైతం నచ్చిన వాళ్లకు ఓటు వేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా( Devara )తో బిజీగా ఉండగా ఈ సినిమా రిలీజ్ కు మరో 5 నెలల సమయం ఉంది.

దేవర అక్టోబర్ లో క్రియేట్ చేసే రికార్డులు మామూలుగా ఉండవని ఫ్యాన్స్ చెబుతున్నారు.

కెరీర్ పరంగా తారక్ అంతకంతకూ ఎదుగుతున్న సంగతి తెలిసిందే.

ఆ హీరో నో చెప్పడం బాధించింది.. వైరల్ అవుతున్న గౌతమ్ మీనన్ కామెంట్స్!