డఫా ‌గేమ్ కు అలవాటు పడి 15 లక్షలు అప్పు చేసి ఆడాడు.. చివరికి…

ప్రస్తుత కాలంలో కొందరు ప్రతి విషయానికి ఆత్మహత్య చేసుకుంటూ తమ కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నారు.

తాజాగా డఫా గేమ్ ఆడడం కోసం దాదాపుగా 15 లక్షల రూపాయలు అప్పు చేశాడని తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంచిర్యాల జిల్లా వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందిన మొదెల గ్రామంలో మధుకర్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.

యువకుడు ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో ఇంటి పట్టునే ఉంటున్నాడు.ఈ క్రమంలో  మధుకర్ కాలక్షేపం కోసం అప్పుడప్పుడు ఆన్ లైన్ గేమ్స్ ఆడటం మొదలు పెట్టాడు.

రానురాను ఈ కాలక్షేపం కాస్త బానిసత్వానికి దారి తీసింది.దీంతో ఏకంగా మధుకర్ ఆన్ లైన్ డఫా గేమ్ ఆడడానికి దాదాపుగా 15 లక్షల రూపాయలు బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో అప్పు చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న  మధుకర్ తల్లిదండ్రులు పరువు, గౌరవం కోసం అప్పులన్నీ తీర్చారు.

అలాగే  ఇక నుంచైనా ఆన్ లైన్ గేమ్స్ ఆడటం మానేసి బుద్ధిగా చదువుకోవాలని  మధుకర్ ని మందలించారు.

"""/"/ దీంతో తీవ్ర మనస్థాపానికి గురైనటువంటి మధుకర్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.ఇందులో భాగంగా పురుగుల మందు సేవించాడు.

ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినా ఉపయోగం లేకపోయింది.

దీంతో చేతికి అంది వచ్చిన కొడుకు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

తారక్ పేరెత్తడానికి కూడా ఇష్టపడని బాలకృష్ణ.. తమ హీరో అంత తప్పేం చేశాడంటూ?