చిన్న వయసులోనే యువతకు గుండెపోటు.. ఇవే కారణం అంటున్నా డాక్టర్లు..

ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే యువత కూడా గుండెపోటు కు గురవుతున్నారు.

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కి వారంలో ఇద్దరు, ముగ్గురు యువతీ, యువకులు గుండెపోటు సమస్యతో వస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కోవిడ్ తర్వాత యువతలో గుండె సమస్యలు పెరిగిపోయాయి.చిన్న వయసులో ఉండే యువతలో గుండెపోటు రావడానికి కారణం విపరీతమైన ఒత్తిడి, ధూమపానం, మద్యపానం ప్రధాన కారణాలు కలుషిత గాలి, ఆహారపు అలవాట్లు కూడా కారణాలుగా ఉన్నాయి.

యువత గుండెపోటు రాకుండా ఉండాలంటే చిన్నప్పటినుంచి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అవసరమని వైద్యులు చెబుతున్నారు.

గుండెపోటు రావడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.చిన్న వయసులోనే గుండెపోటుకు గురవడానికి వైద్యులు చాలా కారణాలను చెబుతున్నారు.

చదువులో, ఉద్యోగాలలో తీవ్రమైన ఒత్తిడికి గురవడం ముఖ్యమైన కారణం అని చెబుతున్నారు.మద్యపానం, ధూమపానం కూడా ప్రధానమైన కారణాలే.

"""/"/ ఫాస్ట్ ఫుడ్ వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణం.

రెండు పదుల వయసులోనే మధుమేహం వ్యాధి వచ్చిన గుర్తించకపోవడం వల్ల ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.

తల్లిదండ్రులు ఇద్దరికీ గుండె జబ్బులు ఉంటే వారి పిల్లలు చిన్న వయసులోనే గుండె పోటు బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వాతావరణ కాలుష్యం కూడా గుండె జబ్బుకు దారితీస్తుంది.రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడి 20 ఏళ్ల వయసు వారికి కూడా గుండెపోటు వస్తోంది.

"""/"/ గుండెపోటు రాకుండా ఆరోగ్యాన్ని రక్షించడానికి చేయవలసిన పనులు.గుండె జబ్బుల భారీనా పడకుండా ఉండాలంటే జీవన శైలి మార్చుకోవాల్సి ఉంటుంది.

పనిలో ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది.యోగా ధ్యానం వంటి వాటిపై దృష్టి పెట్టాలి.

శరీరక శ్రమ కలిగి రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్, వ్యాయామం చేయడం మంచిది.

తల్లిదండ్రులకు గుండె జబ్బులు ఉన్నవారు వయసు 30 ఏళ్లు దాటిన తర్వాత హార్ట్ చెకప్ తరచూ చేయించుకుంటూ ఉండటం మంచిది.

ఆరోగ్యాకరమైన ఆహారం తీసుకోవాలి.ఫస్ట్ ఫుడ్, నూనె ఎక్కువగా విరిగిన జోలికి అసలు పోకూడదు.