బైక్ పై స్టంట్స్ చేస్తున్న యువకులు

నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుండి దగ్గర నుంచి బస్టాండ్ వరకు కొంతమంది ఆకతాయిలు బైక్స్ పై రౌండ్ కొడుతూ స్టంట్స్ వేస్తున్నారు.

ఇంటర్ ఎగ్జామ్స్ ముగించుకొని వెళుతున్న విద్యార్దినులే టార్గెట్ గా ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

ఒక్కొక్క బైక్ పై ముగ్గురు నుంచి నలుగురు యువకులు కూర్చుని ఓవర్ స్పీడ్ తో బైకులు నడుపుతు ఎదురు వచ్చే వాహనదారులు భయాందోళనలకు గురి చేస్తున్నారని పట్టణ ప్రజలు వాపోతున్నారు.

పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకావాలని కోరుతున్నారు.

ఆ స్థానాల్లో మేమే గెలుస్తాం .. బీఆర్ఎస్ ధీమా వెనుక ..?