రోడ్డుపై రీల్స్ చేస్తున్న యువత.. ఒక్కసారిగా వారిపైకి దూసుకొచ్చిన కారు.. చివరకు?
TeluguStop.com
ఇంటర్నెట్ పుణ్యమా(Internet Blessing.) అని యూత్‌లో రీల్స్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో లైకులు, షేర్‌లు పొందడం ద్వారా ఫేమస్ అవ్వాలనే ఆశతో యువత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా రీల్స్(Reels) తీసేందుకు వెనుకాడటం లేదు.
అయితే, ఈ క్రేజ్ కారణంగా కొంతమంది తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు.ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు చాలానే చూసాము.
అచ్చం ఇలాంటి ఘటన మరోకోటి తాజాగా రీల్స్ తీయడం వలన జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో, నలుగురు పురుషులు, ఒక మహిళ రోడ్డుపై నడుచుకుంటూ రీల్స్ తీసుకుంటున్నారు.
హఠాత్తుగా వచ్చిన ఒక వాహనం వారిని ఢీకొట్టింది.ఈ ప్రమాదకర ఘటన దృశ్యాలు నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్నాయి.
"""/" /
ఇక ఈ వీడియో వైరల్ కావడంతో వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
రీల్స్ కోసం యువత తన భద్రతను పక్కనబెట్టి చేసే పనులు విమర్శలకు గురవుతున్నాయి.
అలాగే, రోడ్డుపై రీల్స్ తీయడాన్ని నివారించే కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
ఈ సంఘటన యువతకు ఒక గుణపాఠం కావాలి.రీల్స్ కోసం చేసే నిర్లక్ష్యపు చర్యలు తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదకరమవుతాయి.
ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా యువతలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.ఇన్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో వేదికలు యువతను ప్రోత్సహించే విధంగా ఉండాలి.
కానీ, వారు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా అవసరం.ప్రాణాలకు మించి లైకులు, షేర్‌లకు విలువ ఇవ్వడం సమాజానికి వినాశకరమని ఈ సంఘటన ద్వారా స్పష్టమవుతోంది.
తెలుగు డైరెక్టర్ తో సినిమాకి కమిట్ అయిన విక్రమ్…