విశాఖ రేవ్ పార్టీ వెనుక ఉన్న ఆ మంత్రి ఎవరు

ప్రశాంత నగరమైన విశాఖలో కొద్ది రోజుల క్రితం రేవ్ పార్టీ కలకలం రేపిన సంగతి అందరికి తెలిసిందే.

ఆ పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం కూడా ఉండటంతో ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కి పడ్డారు.

విశాఖ లాంటి ప్రశాంత నగరంలో కూడా డ్రగ్స్ మాఫియా అడుగు పెట్టిందా అనే అనుమానాలు బలపడ్డాయి.

అదే సమయంలో రేవ్ పార్టీ లాంటి విష సంస్కృతిని విశాఖలో పెంచి పోషించే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు అనే కోణంలో కూడా పోలీసులు ద్రుష్టి పెట్టారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని, అలాగే నిర్వాహకులని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసారు.

కాని ఈ రేవ్ పార్టీ వెనుక ఇంకా ఎవరో అదృశ్య శక్తి హస్తం ఉందని పోలీసుల విచారణలో బయటపడటం ఇప్పుడు సంచలనంగా మారింది.

తాజాగా స్వయానా డీజీపీ నేరుగా మీడియాలో రేవ్ పార్టీ వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయని, ఓ యువ మంత్రి హస్తం ఉందనే కోణంలో మాట్లాడారు.

అయితే పూర్తి ఆధారాలు దొరికిన తర్వాత దీనికి ఎవరు బాధ్యులైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ఆ యువ మంత్రి ఎవరు, అతనికి రేవ్ పార్టీకి సంబంధం ఏంటి అనే అనుమానం రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

వీడియో వైరల్: మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!