గర్బా డాన్స్ చేస్తూ మృతి చెందిన యువకుడు... వీడియో వైరల్...
TeluguStop.com
ప్రపంచంలోని ప్రతి ఒక్క మనిషి జీవితం ఎంతో విలువైనది.ఎందుకంటే మనిషి చావు బ్రతుకు ఆ మనిషి చేతిలో కూడా ఉండదు.
అప్పటివరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించిన మనిషి ఒక్క క్షణంలోనే కుప్పకూలి ప్రాణాలు విడిచినా సంఘటనలు సోషల్ మీడియాలో ఎన్నో చూస్తూ ఉంటాం.
సోషల్ మీడియాలోనే కాదు మన ఊరిలో రాత్రి చూసిన వ్యక్తి ఉదయం మరణించినప్పుడు మనం అదే అనుకుంటూ ఉంటాం.
రాత్రి నేను చూసిన ఆ వ్యక్తి మరణించాడా అని ఆశ్చర్యపోతుంటాం.అలాంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.నవరాత్రుల సందర్భంగా చాలా రాష్ట్రాల్లో భక్తులు గర్బా డ్యాన్స్‌లు చేస్తూ సంతోషంగా వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు.
అయితే, ఈ పండుగ వేడుకల్లో గుజరాత్‌కు చెందిన ఓ యువకుడు గర్బా డ్యాన్స్ చేస్తూ సడన్ గా కుప్పకూలి చనిపోయాడు.
గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాలోని తారాపూర్‌లో ఉన్న ఆతీ శివశక్తి సొసైటీలో ఆదివారం సాయంత్రం గర్బా డ్యాన్స్ చేస్తూ యువతీ యువకులు ఎంతో సంతోషంగా పండుగ వేడుకలను జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా యువతీ, యువకులు చుట్టూ తిరుగుతూ పాటలకు డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ సంతోషంగా పండుగ వేడుకలను జరుపుకుంటూ ఉన్నారు.
అందరూ గర్భ డాన్స్ చేస్తూ సంతోషంగా ఉన్న సమయంలో వీరేంద్ర సింగ్ రమేష్ బాయ్ రాజ్ పుత్ ఒక్కసారిగా డాన్స్ చేస్తూ ముందుకు వచ్చి కింద పడిపోయాడు.
"""/"/
ఈ సంఘటన చూసిన అక్కడ ఉన్న వారంతా ఆందోళనకు గురయ్యారు.తన బంధువులు స్నేహితులు అతన్ని పైకి లేపడానికి ప్రయత్నించిన అతడు అస్సలు కదలలేదు.
దానితో అక్కడ ఉన్న వారంతా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.అప్పటికే ఆ యువకుడు గుండెపోటుతో మరణించాడని వైద్యులు తెలిపారు.
ఈ విషయం వైద్యులు చెప్పడంతో పండగ పూట ఆ ఇంట్లో విషాదకరమైన వాతావరణం ఏర్పడింది.
ప్రస్తుతం యువతి యువకులంతా కలిసి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ న్యాచురల్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ గ్లో..!