టిక్ టాక్.. ఇంకొకరిని చంపేసింది!

టిక్ టాక్ వచ్చినప్పటి నుండి లెక్కలేనంత మంది చచ్చిపోతున్నారు.ఆ యాప్ ఒక్కసారి వినియోగించారంటే చాలు దానికి బానిసలూ అయిపోతారు.

ఆ యాప్ లో పెరిగే పాపులారిటికి ఫిదా అయ్యి.ఇంకా ఇంకా పాపులారిటీ పెంచుకోవాలి అనే ఆలోచనలో ఎంతోమంది యువతీ యువకులు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

కొందరు ప్రాణాలనే పోగుట్టుకుంటున్నారు. """/"/ఈ నేపథ్యంలోనే టిక్ టాక్ కారణంగా మరో యువకుడు ప్రాణం పోగుట్టుకున్నాడు.

ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్‌లో కాలువలోకి దూకుతూ వీడియో తీసుకోడానికి ప్రయత్నించిన రాజ్‌ ఖురేషీ అనే యువకుడు డ్యామ్ లో నీళ్లు ఎంత లోతు ఉన్నాయి ? అసలు ఉన్నాయా? లేదా అనేది చూసుకోకుండా ఓ డ్యామ్ గట్టు మీద నుండి కిందకి దూకాడు.

అంతే ఇక.కింద నీరు తక్కువగా ఉండటంతో అతడి తల నేరుగా కాంక్రీట్ దిమ్మను తాకింది.

దీంతో అతడి తల పగిలి.అక్కడికక్కడే చనిపోయాడు.

నీటిలో పడిన రాజ్‌లో ఎంతకీ చలనం లేకపోవడంతో అతడి స్నేహితులు హుటాహుటిన డ్యామ్‌లోకి దిగి రక్షించే ప్రయత్నం చేశారు.

కానీ, అప్పటికే రాజ్ చనిపోయాడు.దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.