బాల్య వివాహం: ఆరో తరగతి బాలికను వివాహం చేసుకున్న యువకుడు..

ప్రస్తుతం ప్రపంచంలో రోజు ఏదో ఒకటి టెక్నాలజీ పుట్టుకొస్తున్న నేపథ్యంలో వింత పోకడలు ఎక్కువైపోతున్న సమయం ఇది.

రోజుకో టెక్నాలజీ, రోజుకొక ఆవిష్కరణ ఇలా రాకెట్ వేగంతో దూసుకు వెళ్తున్నారు ప్రజలు.

కొందరు అలా ఉంటే మరికొందరేమో.ఇంకా పాత పద్ధతులను ఆచరిస్తూ వెనుకబడి ఉండిపోయారు.

ఎప్పుడో మన తాత ముత్తాతల సమయాలలో ఆచారంగా కొనసాగిస్తున్న బాల్య వివాహాలకు( Child Marriages ) సంబంధించిన సాంప్రదాయాలను ఇంకా కొంతమంది పాటిస్తున్నారు.

ప్రభుత్వాలు ఉపాధ్యాయులు ఇలాంటి విషయంపై ఎన్నిసార్లు అవగాహన కల్పించిన కొందరిలో మాత్రం ఎటువంటి మార్పు కనపడటం లేదు.

బడికి వెళ్లాల్సిన అమ్మాయిలను చదువుకోవాల్సిన సమయంలోనే సంసార భారం వారిపై మోపి పసి జీవితాలలో బరువు బాధ్యతలను తోసేపిస్తున్నారు.

కాలం మారుతున్న కానీ.మరోవైపు బాల్య వివాహలు మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

"""/" / ఇకపోతే తాజాగా ఓ బాల్య వివాహం మహబూబ్ నగర్ జిల్లా( Mahabubnagar District ) గండీడ్ మండల పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది.

ఆ గ్రామంలో నివసించే బీరప్ప( Beerappa ) అనే ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన ఆరో తరగతి చదువుతున్న అమ్మాయిని( Sixth Class Girl ) పెళ్లి చేసుకున్నాడు.

మే నెలలో వేసవి సెలవులు కావడంతో ఆ బాలికకు ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేసినట్లు సమాచారం తెలుస్తోంది.

"""/" / అయితే జూన్ రెండవ వారంలో పాఠశాల పున ప్రారంభం కావడంతో బాలిక మళ్ళీ స్కూలుకు రావడం మొదలుపెట్టింది.

కాకపోతే., ఆ అమ్మాయి ప్రవర్తనలో కాస్త తేడా అనిపించడంతో ఉపాధ్యాయులకు అనుమానం వచ్చి ఆ విషయాన్ని జిల్లా అధికారులకు సమాచారం అందించారు ఉపాధ్యాయులు.

ఇక అధికారుల సమక్షంలో బాలికను విచారించడంతో అమ్మాయికి పెళ్లయిన విషయం బయటకు వచ్చింది.

ఈ సందర్భంగా అధికారులు బాలికను స్టేట్ హోమ్ కు తరలించారు.ఈ విషయం సంబంధించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న బీరప్పను, అలాగే వారి కుటుంబ సభ్యులపై కూడా ఫోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు.

ఆలియా నా జీవితంలో చాలా స్పెషల్… రణబీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?