పోలీస్ లాఠీకి యువకుడు బలి..!
TeluguStop.com
ఏపీలో కరోనా విజృంభిస్తుంది.ఈ మహమ్మారిని అరికట్టేందుకు అక్కడి జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
మాస్కు లేకుండా బయటికి వచ్చిన వారిపై జరిమానాలు విధిస్తున్నారు.మాస్క్ లేకుండా ఓ దళిత యువకుడు బయటికి వచ్చారు.
ఈ క్రమంలో పోలీసులు యువకుడిని కొట్టడం వల్ల మృతి చెందడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ ఘటన ప్రకాశం జిల్లాలో మరో ఘోరం చోటుచేసుకుంది.పూర్తీ వివరాల్లోకి వెళ్తే.
చీరాలలో మూడు రోజుల క్రితం కిరణ్ తన స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై బయటకు వచ్చాడు.
చీరాల ఎస్‌ఐ విజయ్‌కుమార్ వారిని ఆపి మాస్క్ ధరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా వైరస్ విజృంభిస్తుంటే మాస్క్ పెట్టుకోకుండా బయటకు వస్తారా? అని లాఠీతో తీవ్రంగా కొట్టారనే ఆరోపణలు వస్తున్నారు.
ఆ దెబ్బలకు కిరణ్ అక్కడికక్కడే సృహతప్పి పడిపోగా, అతన్ను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.అయితే కిరణ్ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కిరణ్ బుధవారం ఉదయం మృతి చెందాడు.పోలీసు దెబ్బల కారణంగానే కిరణ్ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
కిరణ్ తండ్రి మోహన్‌రావు చీరాలలో రేషన్ డీలర్‌గా పనిచేస్తున్నారు.తాజాగా ఘటనపై ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశిల్ స్పందించారు.
ఘటనపై స్వతంత్రంగా పక్క జిల్లా అధికారులతో దర్యాప్తు చేయిస్తామని వెల్లడించారు.యువకుడి మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో స్వయంగా మాట్లాడానని తెలిపారు.
బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ఎస్పీ ప్రకటించారు.
కంటతడి పెట్టిస్తున్న వానర ప్రేమ..