ఎంత చెప్పినా పెళ్లి చేయట్లేదని యువకుడు ఏకంగా…

ఈమధ్య కాలంలో కొందరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల తమ కుటుంబ సభ్యుల జీవితాల్లో తీవ్ర విషాదం నింపుతోంది.

తాజాగా ఓ యువకుడు తన ఇంట్లో వాళ్ళు తనకి పెళ్లి చేయడం లేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలో నవీన్ అనే 24 సంవత్సరాల కలిగినటువంటి ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.

 అయితే ఇతడు ఇటీవలే చదువులు పూర్తి చేసుకుని ఇంటిపట్టునే ఖాళీగా ఉంటున్నాడు. దీంతో అప్పుడప్పుడు తన తల్లిదండ్రులను తనకు పెళ్లి చేయాలని విసిగించేవాడు.

 కానీ ప్రస్తుతం నవీన్ కి ఎలాంటి ఉద్యోగం లేనందున కొంతకాలం పాటు ఆగాలని సర్ది చెబుతూ వస్తున్నారు.

 దీంతో నవీన్ అప్పుడప్పుడు తనకు పెళ్లి చేయకపోతే ఏకంగా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేవాడు.

ఈ క్రమంలో తాజాగా మరోమారు తన పెళ్లి విషయమై నవీన్ తన కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు.

  ఈ గొడవలో తీవ్ర మనస్తాపం చెందిన నవీన్ తన నివాసంలోని గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.

 ఈ విషయం గమనించిన తన కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించినప్పటికీ అప్పటికే తీవ్ర నష్టం వాటిల్లింది.

దీంతో చేతికంది వచ్చిన కొడుకు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి.

ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల బరిలో భారత సంతతి మహిళా డాక్టర్