భవనంపై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య

నల్లగొండ జిల్లా:భవనంపై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే పట్టణంలోని రెడ్డి కాలనీలో శ్రీకాంత్ (35) అనే యువకుడు అపార్ట్ మెంట్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

అతను ఎందుకు ఆత్మహత్యకు చేసుకున్నాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

ఫిలింఫేర్ అవార్డులలో సత్తా చాటిన సాయి పల్లవి… స్టార్ హీరోయిన్లను వెనక్కి నెట్టి మరీ?