కరోనా సోకిందని బావిలోకి దూకి యువకుడి ఆత్మహత్య..!

తెలంగాణలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది.కరోనా సోకిన తర్వాత పక్కవారి వివక్షతోనే కరోనా బాధితులు కుంగిపోతున్నారు.

కరోనా సోకితే సరైన వైద్యం లేదని భావింంచి అపోహలతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

తాజాగా కరోనా సోకడంతో డిప్రెషన్ కు లోనై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామానికి చెందిన మహబూబ్ ఆలీ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

దీంతో మనస్తాపానికి గురై ఆలీ నర్సంపేటలోని తన ఇంటి వెనకాల ఉన్న బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆలీ కనిపించక పోవడంతో ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అనంతరం ఇంటి వెనుక ఉన్న బావిలో చూడగా అందులో ఆలీ శవమై కనిపించాడు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కరోనా పాజిటివ్ అని తెలిస్తే సమాజం వెలివేస్తుందనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆలీ కుటుంబ సభ్యులు వాపోయారు.

రాజమౌళి సినిమా కోసం 17 ఏళ్ల సెంటిమెంట్ బ్రేక్ చేసిన మహేష్ బాబు?