బస్సులో అపరిచితుడు భుజంపై తలవాల్చిన యువతి.. నెక్స్ట్ ఏం జరిగిందంటే..?
TeluguStop.com
సోషల్ మీడియాలో డైలీ ఎన్నో ఆశ్చర్యకరమైన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.ఇలాంటిదే ఒక వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోలో, కొంచెం అలసిపోయినట్లు కనిపించే ఒక అమ్మాయి బస్సు( Bus ) ఎక్కుతుంది.
బస్సులో కిటికీ పక్కన సీటులో కూర్చున్న ఒక అబ్బాయి పక్కన కూర్చుని, ఆ అబ్బాయి భుజం మీద తల వాల్చి నిద్రపోతుంది.
ఆ బస్సు చాలా ఖాళీగా ఉంటుంది.ఎన్నో సీట్లు ఫ్రీగా ఉన్నాయి యువతి మాత్రం ఆ యువకుడి పక్కనకి వెళ్లే కూర్చుంటుంది.
తర్వాత అతడు తనకు ప్రియుడు అన్నట్లుగా అతని భుజం పైన( Shoulder ) పెట్టుకొని హాయిగా పడుకుంటుంది.
కొన్ని సెకన్ల తర్వాత ఆ అబ్బాయి( Man ) ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వైపు చూస్తాడు.
అప్పుడు ఆ అమ్మాయి( Lady ) నవ్వుతుంది.ఆ అబ్బాయి కూడా చాలా సిగ్గు పడుతూ చక్కిలిగింతలు పెట్టినట్టు నవ్వుతాడు.
ఆ అమ్మాయితో మాట్లాడి, తన భుజం మీద తల పెట్టుకొని పడుకోవచ్చు అని అంటాడు.
ఈ వీడియోలో ఆ అమ్మాయి వైట్ స్లీవ్‌లెస్ టాప్, బేజ్ కలర్ ట్రౌజర్, వైట్ స్నీకర్స్ వేసుకుని ఉంది.
తన జుట్టును పైకి కట్టి, కళ్లద్దాలు పెట్టుకుని, ఒక బ్యాగ్‌తో కనిపించింది. """/" /
అంతేకాకుండా, ఆ అమ్మాయి చేతిలో ఒక కెమెరా కూడా ఉంది.
బస్సులో ముందు నిలబడి ఉన్న మరొక వ్యక్తి ఆమె వీడియో తీస్తున్నాడు.ఇది ఒక సోషల్ ఎక్స్‌పరిమెంట్‌లా( Social Experiment ) ఉంది.
తనకు తెలియని ఆ అమ్మాయి తన భుజం మీద తల పెట్టి నిద్రపోవడం లేదు ఎలాంటి హాని లేదని సదరు యువకుడికి అనిపించింది.
ఈ వీడియోను ఫాగుయింబా డబో అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.ఆయన ఈ వీడియోకి "మనిషి అంటే మనిషే" అని క్యాప్షన్ రాశాడు.
ఈ వీడియో ఒకసారి చూడండి. """/" /
ఈ వీడియో జర్మనీ దేశం( Germany ) నుంచి వచ్చింది.
ఇప్పటికే 49 లక్షల మందికి పైగా ఈ వీడియో చూశారు.లక్షలాది మంది లైక్ చేసి షేర్ చేశారు.
చాలామంది ఈ వీడియో కింద కామెంట్లు చేశారు."ఇది చాలా బాగుంది.
కానీ ఒక అబ్బాయి తన తలను ఒక అమ్మాయి భుజం మీద పెట్టుకుంటే? పెద్ద గొడవైపోతుంది.
" అని కొంతమంది ఈ వీడియో కింద కామెంట్ చేశారు.మిగతావాళ్లు జీవితంలో ఇలాంటి చిలిపి పనులు చేస్తే వచ్చే ఆనందమే వేరు అని పేర్కొన్నారు.
ఇతరులకు ఇబ్బంది కలిగిస్తేనే తప్పు అని చెప్పుకొచ్చారు.
వింటర్ లో జుట్టు అధికంగా రాలిపోతుందా.. జామ ఆకులతో పరిష్కరించుకోండిలా!