ఇండో అమెరికన్ యువతి ఓవర్ యాక్షన్…దుమ్ము దులిపేసిన భారతీయులు…!!!

నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దాని ఫలితం తరువాత నాలిక కరుచుకునే పరిస్థితికి దారి తీస్తుంది, ఒక్కో సారి దేహశుద్ది కూడా అవుతుంది.

ఇంచు మించు ఇలాంటి అనుభవమే భారత సంతతి ఇండో అమెరికన్ యువతికి ఎదురయ్యింది.

దేహశుద్ది అవలేదు కానీ బుర్ర మాత్రం క్లీన్ అయ్యింది.భారత్ లో తన తల్లి తండ్రులు, తాత ముత్తాతలు జీవించారని, ఇక్కడి పవిత్ర, అత్యంత ప్రభావితమైన హిందూ మతం, ఆలయాలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, గుడులు, ఇలా ప్రతీ విషయంలో వారు భాగస్వాములుగా ఉన్నారనే విషయం మర్చిపోయి అత్యంత పరమ పవిత్రంగా భారతీయులు కొలిచే వారణాసి పై అనుచిత వ్యాఖ్యలు చేసింది.

దాంతో నెటిజన్లు ఓ దుమ్ము దులిపేసారు.ఇంతకీ అసలేం జరిగిందంటే.

అమెరికాలో మోడల్ గా రాణిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పాపురాల్ మోడల్ గా పేరు తెచ్చుకున్న భారత సంతతి యువతి మోడల్ అపర్ణా సింగ్ తన వ్యపారం కోసం భారత్ లోని ప్రఖ్యాత పుణ్య స్థలమైన వారణాసి లో పర్యటించింది.

అమెరికాలో నగల దుకాణం నిర్వహించే ఆమె వారణాసి లో నగలు తయారుచేసే వారిని కలిసి వారితో వ్యాపార లావాదేవీల కోసం వచ్చింది.

అయితే వారణాసి లో తన దారుణమైన అనుభవం ఇదే అంటూ ఇన్ స్టాగ్రామ్ లో వారణాసి పవిత్రతను దెబ్బతీసేలా ఓ వీడియో పోస్ట్ చేసింది.

"""/"/ నేను ఓ భయంకరమైన అనుభవం ఎదుర్కున్నాను, ఇలాంటి వాతావరణం ఇక్కడ ఉంటుందని అస్సలు అనుకోలేదు, గంగా నదిలో మురుగు నీరు వస్తుంటే అందులో ఇక్కడి వాళ్ళు స్నానాలు చేస్తున్నారు, కొంతమంది వీధులలోనే పడుకుంటున్నారు, వారి పక్కనే కుక్కలు కూడా ఉన్నాయి, ఇక్కడ చాలా ఇళ్ళు హోటల్స్ ఇనుప చట్రాలతో ఉంచబడింది, ఇక నేను బస చేసిన హోటల్ మరీ దారుణంగా ఉంది, తోదరపడి ఇలాంటి ప్రాంతాలకు తెలియకుండా రాకండి అంటూ ఓ బాధా కరమైన వీడియో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పెట్టి వీడియో చేసింది.

దాంతో ఈ వేదియో చూసిన భారత సంతతి వ్యకులు, ఇండో ఎన్నారైలు, భారతీయులు ఆమె బుర్ర వాష్ చేసి పడేశారు.

నీ మూలాలు భారత్ లోనే ఉన్నాయి, నీ తల్లి తండ్రులు ఎక్కడ పుట్టారు, నువ్వు భారతీయురాలివని చెప్పుకోవడం సిగ్గుగా ఉంది అంటూ కొందరు, పవిత్ర స్థలంపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావా నువ్వు మనిషివేనా, నీ అవసరానికి వారణాసి వ్యక్తులు కావాలి అందుకే వచ్చావు వచ్చిన పని చూసుకుని వెళ్లి నోటికి వచ్చినట్లు మాట్లాడకు అంటూ కొందరు ఇలా ఎవరికి వారు అమ్మడి దుమ్ము దులిపేసారు.

దాంతో వెనక్కి తగ్గిన అపర్ణా సింగ్ క్షమాపణలు చెప్పింది.ఎవరైనా భాదపడి ఉంటే క్షమించమని కోరింది, ఇది నా వ్యక్తిగత అనుభవమే తప్ప కించపరచాలని కాదని వేడుకుంది.

సీఎం పదవినే వద్దనుకున్న సోనూసూద్.. ఈ హీరో నిజంగా గ్రేట్ అని అనాల్సిందే!