Tollywood Young Heroes : టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్న యంగ్ హీరోలు.. సీనియర్స్ పని అయిపోయినట్టేనా ?

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోలు, కొత్త హీరోల సినిమాలు పెద్దగా ఆడకపోయేవి.

స్టోరీ చాలా బాగుంటేనే వారి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచేవి.

ఎక్కువగా స్టార్ హీరోలు సినిమాలే ఇండస్ట్రీలో హవా చూపించేవి.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి సూపర్ స్టార్ తీసే సినిమాలు పెద్దగా ఆడటం లేదు.

యంగ్ హీరోల సినిమాలు మాత్రమే ఎక్కువగా హవా చూపిస్తున్నాయి.శ్రీ విష్ణు,( Sri Vishnu ) సుహాస్,( Suhas ) విశ్వక్‌సేన్,( Vishwaksen ) విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, అడవి శేషు, నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, సత్యదేవ్, సంతోష్ శోభన్ వంటి చిన్న హీరోల సినిమాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఏలేస్తున్నాయి.

"""/" / చిరంజీవి జనరేషన్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి వారి సినిమాలు కూడా పర్లేదనిపిస్తున్నాయి.

కాకపోతే వీరి సినిమాలు సంవత్సరానికి ఒకటి లేదా రెండు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే రిలీజ్ అవుతున్నాయి.

ఆ మధ్యలో ఉన్న గ్యాప్ లో ఈ చిన్న హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు.

ఈ స్మాల్ హీరోలే తెలుగు ప్రేక్షకులకు చాలా వినోదాన్ని పంచుతున్నారని చెప్పడంలో సందేహం లేదు.

ఉదాహరణకి ఇటీవల రిలీజ్‌ అయిన హనుమాన్ సినిమాని( Hanuman Movie ) తీసుకోవచ్చు.

ఈ మూవీలో తేజ సజ్జ( Teja Sajja ) నటించాడు.ఇది ఎంతగా ఆకట్టుకుందో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.

మంగళవారం, మ్యాడ్, అంబాజీపేట బ్యాండు, మా ఊరి పోలిమేర 2 వంటివి కూడా బాగా ఆకట్టుకున్నాయి.

"""/" / సేవ్ ద టైగర్స్, దూత, భామ కలాపం, 90's వంటి వెబ్ సిరీస్‌లు కూడా చాలా ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాయి.

ఇక యంగ్ సినిమా హీరోలు చేసే ప్రతి సినిమా కూడా ఒక మంచి హానెస్ట్ అటెంప్ట్‌గా కనిపిస్తోంది.

బోల్డ్ సన్నివేశాలు పెట్టేసి, కొన్ని కుళ్ళు జోకులు యాడ్ చేసేసి ప్రేక్షకుల మీద రుద్దేసి హిట్స్ సాధించాలని వారు అసలు అనుకోవడం లేదు.

మంచి కాన్సెప్టులను ఎంచుకొని హిట్ సాధించాలనే కసితో వారు ఉంటున్నారు.మంచి కథలను సెలెక్ట్ చేసుకోవడంతో పాటు అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ తో వారు ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు.

సినీ ఇండస్ట్రీ కేవలం స్టార్ హీరోల సొంతం కాదని, తాము కూడా దానిని ఏలేయగలమని వీరు చెప్పకనే చెప్పేస్తున్నారు.

వర్షాకాలంలో బీరకాయ తింటున్నారా.. లేకుంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!