మాస్ హీరోగా ఎదగలనుకుంటున్న యంగ్ హీరోలు…

సినిమా ఇండస్ట్రీలో చిన్న హీరోలు లవ్ స్టోరీలు చేసుకుంటూ ముందుకు సాగితే మంచి విజయాలు దక్కుతాయి.

ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో లవ్ స్టోరీ ( Love Story )అయితేనే బెస్ట్ అవుట్ పుట్ తీసుకురావచ్చు.

ఇక సస్పెస్ట్ థ్రిల్లర్ సినిమాలకు కూడా బడ్జెట్ పెద్దగా అవ్వదు.కాబట్టి ఆ సినిమాని కూడా చిన్న హీరోలు చేస్తే బాగుంటుంది.

ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలే కాకుండా తక్కువ బడ్జెట్ లో అయిపోయే సినిమాను చేసుకుంటే బాగుంటుంది.

అలా కాకుండా చిన్న హీరోలు అందరూ కూడా మాస్ సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతోనే బొక్క బోర్లా పడుతున్నారు.

నిజానికి విశ్వక్ సేన్ హీరో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ( Gangs Of Godavari )అనే సినిమాతో మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలని చూసాడు.

"""/" / కానీ ఆ సినిమా తేడా కొట్టింది.ఇక దానివల్ల ఆయన మళ్లీ లవ్ స్టోరీ సినిమాలనే చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇక కృష్ణమ్మ సినిమాతో ( Krishnamma )సత్యదేవ్ కూడా మాస్ జపం చేశాడు అయినప్పటికి అది వర్కౌట్ కాలేదు.

ఇక మొత్తానికైతే మన యంగ్ హీరోలందరూ కూడా మంచి సక్సెస్ ని సాధించాలి అంటే మాత్రం వాళ్లకి తప్పకుండా మార్కెట్ అనేది క్రియేట్ అవ్వాలి.

అలా క్రియేట్ అవ్వాలి అంటే వాళ్లు మొదట చిన్న చిన్న సినిమాలు చేసిన కూడా వాటితో మంచి విజయాలను సాధిస్తేనే వాళ్లకు కొత్త మార్కెట్ అనేది క్రియేట్ అవుతుంది.

"""/" / ప్రతి చిన్న హీరో కూడా తమదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లాలంటే మాత్రం తప్పకుండా వాళ్లు లవ్ స్టోరీస్ తీస్తేనే బాగుంటుంది అంటూ సినీ మేధావులు( Movie Geniuses ) సైతం వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరి టార్గెట్ కూడా మాస్ హీరో అవ్వడానికే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే కాలక్రమేణా వాళ్లు సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి.అంతేకానీ డైరెక్ట్ గా మాస్ హీరోగా ఎదగాలి అనే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్లకి సక్సెస్ లు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇంతమంది చేయని తప్పు తమన్నా మాత్రమే చేసిందా ? రాద్ధాంతం చేయడం తప్పా !