రాజమౌళి వల్లే తెలుగులో ఉన్న యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ (Create Identity)చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇక ప్రస్తుతం యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా(pan India) మార్కెట్ మీద కన్నేశారు.
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే వరుసగా పాన్ ఇండియా సక్సెస్ లను సాధిస్తూ ఇండియా లెవెల్లో వాళ్ళ మార్కెట్ ని పెంచుకోగలిగే కెపాసిటీ వాళ్లకు ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక ఇప్పటివరకు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) లాంటి యంగ్ హీరో నిఖిల్ లాంటి మీడియం రేంజ్ హీరోలు కూడా పాన్ ఇండియాలో వాళ్ల సినిమాలను రిలీజ్ చేసి మంచి విజయాలను అందుకున్నారు.
మరి వీళ్ళు చేసిన ప్రయత్నం సక్సెస్ ఫుల్ గా నిలవడంతో మిగతా హీరోలు కూడా వీళ్ళ దారిలో నడవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
మరి దానికి అనుగుణంగానే వాళ్ళు చేసే ప్రయత్నం ఫలిస్తుందా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది.
కాబట్టి కంటెంట్ బాగుంటే ఎవరి సినిమా అయిన పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
"""/" /
మరి ఇలాంటి సందర్భంలో యంగ్ హీరోలందరూ ఒకేసారి పాన్ ఇండియా బాట పడుతుండటం కొంతవరకు మంచి విషయమే అయినప్పటికి అందరికీ అక్కడ సక్సెస్ లు లభిస్తాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
మరి ఇప్పటివరకు అయితే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీనే మొదటి వరుసలో ఉండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక బాహుబలి (Bahubali)సినిమాతో రాజమౌళి వేసిన ఈ బాట ను ప్రతి ఒక్క దర్శక హీరోలు కొనసాగిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
కౌశిక్ తల్లి చెప్పిన కామెంట్లలో ఏ మాత్రం నిజం లేదు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ వైరల్!