గ్యాప్ రావడంతో హీరోలకు కనువిప్పు..రూట్ మార్చుతున్న యంగ్ హీరోలు

క‌రోనా మూలంగా సినిమా ప‌రిశ్ర‌మ తీరు అత్యంత దారుణంగా త‌యారైంది.సినిమా షూటింగులు ఎక్క‌డిక్క‌డ నిలిచిపోయాయి.

నిర్మాతల ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది.అప్పు తెచ్చి పెట్టిన డ‌బ్బుల‌కు వ‌డ్డీలు కుప్ప‌లు తెప్ప‌లుగా పెరిగిపోతున్నాయి.

మ‌రో వైపు కరోనా మూలంగా తెలుగు హీరోల మైండ్ సెట్ ను పూర్తిగా మారిపోయింది.

గ్యాప్ వస్తే గానీ వేగం విలువ తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.ఏడాదికి ఒక సినిమా చేసినా హీరోగా 30 సినిమాల కంటే ఎక్కువ చేయ‌లేరు.

ఇక కరోనా లాంటి అవాంత‌రాలు ఎదురు అయితే ప‌ట్టుమ‌ని 10 మూవీస్ కూడా చేయ‌లేం.

ఈ విష‌యాన్ని అర్థం చేసుకున్న టాలీవుడ్ హీరోలు ఎలాగైనా రూట్ మార్చి వేగం పెంచాల‌నుకుంటున్నారు.

ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు.ప్రస్తుతం నాని, నితిన్, నాగ చైతన్య, వరుణ్ తేజ్, సాయి తేజ్, నిఖిల్, కళ్యాణ్ రామ్ లాంటి హీరోలు వరుసగా సినిమాలను సెట్ చేసుకోవడానికి ప్రయత్నాలు షురూ చేశారు.

జూమ్ యాప్ ద్వారా అందరూ కథలు వింటున్నారు.ఇండస్ట్రీలో కథలు పట్టుకుని తిరుగుతున్న కొత్త రచయితలకు, దర్శకులకు మంచి అవ‌కాశం ఇవ్వాల‌ని భావిస్తున్నారు.

కథ చెప్పడానికే ఏళ్ల తరబడి తిరిగే పని లేకుండా హీరోలే కథ ఉంటే చెప్పండి అంటూ ఆరా తీయడంతో కొత్తవాళ్లకు ఇది మంచి అవకాశంగా మారింది.

నాని ఇప్పటికే నాలుగు కథలు విన్నాడట. """/"/ అందులో రెండు కథలను ఓకే చేసిన‌ట్లు ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ న‌డుస్తుంది.

నితిన్ కూడా ప్రస్తుతం ప‌లు కథలు వింటున్నాడు.త్వ‌ర‌లో మ‌రికొన్ని సినిమాల‌కు ఓకే చెప్తాడ‌నే టాక్ వ‌స్తుంది.

నిజానికి నితిన్ ప్రస్తుతం చేస్తోన్న 3 సినిమాల గురించి అందరికీ తెలిసిందే.మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంథాధూన్ రీమేక్ చేస్తున్నాడు.

కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట సినిమాతో పాటు కోన వెంకట్ నిర్మాణంలో మరో సినిమా చేసున్నాడు.

అయినా వరుసగా కథలు వింటున్నాడు.అటు నిఖిల్, నాగ చైతన్య చేతిలో కూడా 4 సినిమాల చొప్పున ఉన్నాయి.

అయినా వాళ్ళు కూడా ప్రస్తుతం కొత్త సినిమాలను ఓకే చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.

ప‌లువురు యంగ్ హీరోలు సైతం ప‌లు సినిమాల‌కు ఓకే చెప్పేందుకు సిద్ధం అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

Chandrababu : కదిరి ప్రజాగళం సభలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!