నా సినిమాలు చూస్తే కొడుకు అలా ప్రవర్తిస్తాడు.. నాని కామెంట్స్ వైరల్!

న్యాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

టక్ జగదీష్ ప్రమోషన్స్ లో భాగంగా నాని మాట్లాడుతూ బాల్యంలో పండుగ సమయంలో థియేటర్లలో సినిమా విడుదలయ్యేదని ప్రస్తుతం పండుగ సమయంలో ఓటీటీలో సినిమా రిలీజవుతుందంటే ప్రపంచం చాలా మారిపోయిందని అనిపిస్తుందని నాని చెప్పుకొచ్చారు.

వినాయక చవితి పండుగ సమయంలో ఇంట్లో చాలా సందడిగా ఉంటుందని నాని అన్నారు.

తాను అమీర్ పేటలో మట్టి గణపతితో పాటు సామాగ్రిని తీసుకొని వచ్చేవాడినని నాని చెప్పుకొచ్చారు.

తాను, అక్క వినాయకునిపై పూలు వేసేవాళ్లమని ఆ సమయంలో అమ్మ వినాయకవ్రతకల్పం చదివేవారని నాని తెలిపారు.

అమ్మ బాల్యంలో పండుగ రోజు వినాయక వ్రతకల్పం విని అక్షింతలు వేసుకోకపోతే నీలాపనిందల పాలవుతామని చెప్పేవారని నాని చెప్పుకొచ్చారు.

చిన్నప్పటి నుంచి ఆ భయం మనస్సులో నాటుకుపోయిందని నాని తెలిపారు.అయితే తన కొడుకు జున్ను మాత్రం పూజలను బాగా ఇష్టపడతాడని నాని అన్నారు.

పిల్లలు ఎవరైనా పూజలు అంటే పారిపోతారని తన కొడుకు మాత్రం పూజలు అంటే ముందుకు వచ్చి కూర్చుంటాడని నాని చెప్పుకొచ్చారు.

తన సినిమాలను చూస్తే కొడుకు సిగ్గుపడతాడని నాని కామెంట్లు చేశారు.నేను హీరోయిన్లతో కలిసి కనిపిస్తే కొడుకుకు నచ్చదని నాని అన్నారు.

"""/"/ అమ్మతో మాతమే కలిసి కనిపించాలని కొడుకు ఫీలింగ్ అని నాని తెలిపారు.

లాల్ సింగ్ చద్దా కోసం అమీర్ ఖాన్ ఆరు నెలల క్రితం ఫోన్ చేశారని డేట్లు కుదరలేదని అన్నారు.

భవిష్యత్తులో మంచి కథ దొరికితే బాలీవుడ్ లో ప్రయత్నించాలని నాని చెప్పుకొచ్చారు.నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమాతో పాటు అంటే సుందరానికి సినిమాలలో నటిస్తున్నారు.

ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో దక్కని ఊరట