ఆ సినిమాలను రిజెక్ట్ చేసి చైతన్య తప్పు చేశారా.. స్టార్ హీరో అయ్యేవాడంటూ?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాగచైతన్య జోష్ సినిమా నుంచి భిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

ఏ మాయ చేశావె, 100% లవ్, తడాఖా, మజిలీ, మనం, మరికొన్ని సినిమాలు నటుడిగా నాగచైతన్య రేంజ్ ను పెంచాయి.

అయితే నాగచైతన్య తన సినీ కెరీర్ లో మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నారు.

ఈ సినిమాలను రిజెక్ట్ చేయకుండా ఉండి ఉంటే మాత్రం చైతన్య కెరీర్ మరోలా ఉండేది.

నాగచైతన్య జోష్ సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టినా ఈ సినిమా కంటే ముందు చైతన్యకు కొత్తబంగారు లోకం సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.

అయితే కథ నచ్చినా కొన్ని కారణాల వల్ల ఆ సినిమాతో నాగచైతన్య ఎంట్రీ జరగలేదు.

ఆ తర్వాత కొత్తబంగారు లోకం సినిమాలో వరుణ్ సందేశ్ నటించడం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో నటించి ఉంటే తొలి సినిమాతోనే చైతన్య ఖాతాలో సక్సెస్ చేరి ఉండేది.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2022/06/a-aa-movie-shocking-facts-Bhale-bhale-magaoy!--jpg" / నాగచైతన్య రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో భలే భలే మగాడివోయ్ ఒకటి.

మతిమరపు ఉన్న అబ్బాయి పాత్ర రిస్క్ అని భావించిన నాగచైతన్య ఆ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపలేదు.

అదే సమయంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న నాని అదే సమయంలో ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.

నాగచైతన్య ఈ సినిమాను వదులుకొని తప్పు చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. """/" / నాగచైతన్య ఈ సినిమాలతో పాటు త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన అఆ సినిమాలో నటించే అవకాశాన్ని కూడా వదులుకున్నారు.

ఈ సినిమా నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఫుల్ రన్ లో 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

డేట్లు కేటాయించలేక నాగచైతన్య ఈ సినిమాను వదులుకున్నారని సమాచారం అందుతోంది.

ఈ సంగతి తెలిస్తే, మీరు ఇక పానీపూరి బండివంక కన్నెత్తి కూడా చూడరు!