పంచె కట్టుకొని డాబాపైకి వెళ్లిన యంగ్ హీరో.. వైరల్ గా మారిన వీడియో?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లకు, నటీనటులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

అయితే కొందరు నటీనటులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తమ ఫ్యాన్ ఫాలోయింగ్ ని బట్టి ఆంక్షల్లో జీవిస్తూ ఉంటారు.

అటువంటి భారీ పాపులారిటీ ఉన్న హీరోలు బయటకు రావాలి అంటే నేను ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉంటారు.

ఒకవేళ అటువంటి హీరోలు జనంతో కలిసి తిరగడం అన్నది కుదరని పని.ఒకవేళ తప్పనిపరిస్థితుల్లో జనంలోకి రావాల్సి ఉన్నప్పుడు చుట్టూ సెక్యూరిటీ తప్పకుండా ఉండాల్సిందే.

అయితే ఇది కేవలం కొందరు హీరోల విషయంలో మాత్రమే, మరికొంత మంది హీరోలు ఇవేవీ పట్టించుకోకుండా కొన్ని కొన్ని సార్లు జనంలో కలిసి పోతూ ఉంటారు.

రజనీకాంత్‌ వీలు చిక్కినప్పుడల్లా హిమాలయాలకు వెళ్లిపోయి అక్కడ సాధారణ జీవితం గడుపుతారు.అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఓ సారి రోడ్డు పక్క హోటల్‌లో టిఫిన్‌ చేశారు.

అలాగే మరొక స్టార్ అజిత్‌ ఓసారి ఆటోలో ప్రయాణించారు.అయితే వీరంతా, తమ స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి ప్రవర్తించారు.

"""/"/ తాజాగా వారి జాబితాలోకి కుర్రహీరో కిరణ్‌ అబ్బవరం చేరిపోయారు.ఆయన పంచెతో రోడ్డు పక్క డాబాలో భోజనం చేశారు.

తాజాగా, కిరణ్‌ అబ్బవరం హైదరాబాద్‌లోని ఓ రోడ్డు పక్క డాబాకు వెళ్లారు.ఎంతో సాధాసీధాగా పంచెతోనే డాబాలో భోజనం చేశారు.

భోజనం అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరి, కిరణ్‌ అబ్బవరం సింప్లిసిటీపై అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.