సెట్ లో గాయపడ్డ యంగ్ హీరో.. 25 కుట్లు పడి ఫేస్ మొత్తం?

సాధారణంగా సినిమా షూటింగులు జరిగే సమయంలో కొన్నిసార్లు హీరో హీరోయిన్లకు ప్రమాదాలు జరుగుతుంటాయి.

అయితే కొందరు చిన్నచిన్న ప్రమాదాలతో బయట పడుతుంటారు మరికొందరు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు.

అయితే ప్రమాదాలు జరిగినప్పుడు కొందరి ముఖకవళికలు కూడా మారిపోతూ ఉంటాయి.ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ సెట్లో గాయపడినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

తెలుగులో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం జెర్సీ.

ఈ సినిమాను హిందీ రీమేక్ చిత్రంగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా నటించారు.

అయితే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇదిలా ఉండగా తాజాగా షాహిద్ కపూర్ ఈ సినిమా సెట్స్ లో జరిగిన ఒక ప్రమాదాన్ని వెల్లడించారు.

"""/"/ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటించడానికి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో బాల్ తన పెదవికి తగలటం వల్ల 25 కుట్లు పడ్డాయని ఈ సందర్భంగా ఈ యంగ్ హీరో వెల్లడించారు.

అయితే గాయం తగిలినప్పుడు తను పూర్తిగా తన పెదవి పనిచేయదని భావించానని తన ముఖ కవళికలు కూడా మారిపోయాయని చెప్పుకొచ్చారు.

ఇక ఈ గాయం నుంచి కోలుకోవడానికి సుమారు రెండు నెలల సమయం పట్టిందని అప్పటివరకు సినిమా షూటింగ్ ఆపేస్తామని ఈ సందర్భంగా షాహిద్ కపూర్ వెల్లడించారు.

ఆ కంచుకోటల్లో ఈసారైనా బోణీ కొడతారా ?