సినిమాలు ఆపేస్తున్న యువ హీరో..!
TeluguStop.com

పట్టుమని 15 సినిమాలు చేశాడో లేదో యువ హీరో తను సినిమాలను ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నానని ప్రకటించారు.


పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే ఆ యువ హీరో తీసుకున్న నిర్ణయానికి అందరు షాక్ అవుతున్నారు.


ఇంతకీ సినిమాలను ఆపేయాలనుకుంటున్న హీరో ఎవరంటే తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్ అని తెలుస్తుంది.
తమిళనాడు సీఎం ఎం.కె స్టాలిన్ తనయుడు ఉదనిధి స్టాలిన్.
కేవలం హీరోగానే కాదు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు ఉదయనిధి స్టాలిన్.అనూహ్యంగా ఆయన సినిమాలకు దూరం అవ్వాలని అనుకుంటున్నారు.
సినిమాలు, పాలిటిక్స్ రెండిటిని బ్యాలన్స్ చేయడం కష్టం అవుతుందని.అందుకే సినిమాలను ఆపేసి పూర్తిస్థాయిలో రాజకీయాల మీద దృష్టి పెట్టాలని చూస్తున్నారట.
ఇప్పటికే ఎమ్మెల్యేగా తన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తున్న ఉదయనిధి స్టాలిన్ ఇక మీదట తన ఫుల్ ఫోకస్ రాజకీయాల మీదే పెట్టాలని ఫిక్స్ అయ్యారట.
ప్రస్తుతం ఉదయనిధి మామన్నన్ సినిమా చేస్తున్నారు.ఆ సినిమానే తన చివరి సినిమా అంటూ ప్రకటించడం విశేషం.
సినిమాల కన్నా రాజకీయాలే ముఖ్యమని ఉదయనిధి స్టాలిన్ నిర్ణయించుకోవడం గొప్ప విషయమే అని చెప్పొచ్చు.
ఇప్పటినుండే పార్టీ విధి విధానాలను దగ్గర ఉండి చూసుకోవాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది.
మోహన్ లాల్ ఎల్ 2 ఎంపూరన్ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?