విజయ్ దేవరకొండ చేతుల మీదగా పుష్పక విమానం ఫస్ట్ సాంగ్ రిలీజ్..!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు.ఈయన పెళ్లి చూపులు సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో టాప్ హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.

ఇప్పటికి అర్జున్ రెడ్డి సినిమా అంటే యూత్ కు చాలా ఇష్టం.అయితే ఈయన స్టార్ అయినా తర్వాత విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

మొదటి సినిమాతోనే ఛాలెంజింగ్ కథతో ప్రేక్షకుల ముందు వచ్చాడు ఆనంద్ దేవరకొండ.దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.

ఈ సినిమా తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా కూడా చేసాడు.

అయితే ఇప్పుడు తన మూడవ సినిమా 'పుష్పక విమానం' తో మన ముందుకు రాబోతున్నాడు.

దామోదర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. """/"/ ఈ రోజు ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన పుష్పక విమానం సినిమా నుండి ఒక పాటను విడుదల చేసారు.

సిలకా ఎగిరిపోయావా ఆశలన్నీ ఇడిసేసి ఎనకా.సిలికా చిన్నబోయిందే సిటీ గుండె పిట్ట నువ్వు లేక.

అంటూ సాగే ఈ పాటను ఈ రోజు ఉదయం 11.07 గంటలకు ఆయన అన్నయ్య విజయ్ దేవరకొండ రిలీజ్ చేసాడు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది.

ఈ సినిమాను విజయ దేవరకొండ సమర్పణలో కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో గీత్ సైని, శాన్వి మేఘన హీరోయిన్లుగా నటిస్తున్నారు.అంతేకాదు ఈ సినిమాలు సునీల్, నరేష్ కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు.

వైరల్: చనిపోయిన కుక్క కళేబరంతో పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తండ్రి.. కొడుకే చంపాడంటూ..