అక్కినేని అఖిల్ జాతకం ఇంత ఘోరంగా ఉందా.. అక్కడ కూడా ఈ హీరోకు మోక్షం లేదా?

అక్కినేని అఖిల్( Akkineni Akhil ) ఏ మూహూర్తాన సినీ కెరీర్ ను మొదలుపెట్టాడో తెలీదు కానీ ఈ హీరోకు కెరీర్ పరంగా ఏదీ కలిసిరావడం లేదు.

కెరీర్ పరంగా ఇప్పటివరకు అఖిల్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక్క సక్సెస్ కూడా అఖిల్ కు లేదనే సంగతి తెలిసిందే.

ఏజెంట్ సినిమా( Agent Movie ) కోసం అఖిల్ ను అమ్మి 80 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈ సినిమాకు 8 కోట్ల రూపాయల కలెక్షన్లు కూడా రాలేదు.

ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనీ లివ్ కొనుగోలు చేసింది. """/" / అయితే గత నెలలోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ ( OTT )కావాల్సి ఉన్నా ఆ సమయంలో స్ట్రీమింగ్ కాలేదు.

ఏజెంట్ సినిమాకు సంబంధించి కీలక మార్పులు చేస్తున్నారని జూన్ 23వ తేదీ నుంచి ఈ సినిమా కచ్చితంగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు జోరుగా ప్రచారంలోకి రావడం గమనార్హం.

అయితే ఈ వార్త కూడా నిజం కాలేదు.సోనీ లివ్( Sony Liv ) ఓటీటీలో ఏజెంట్ సినిమా అందుబాటులోకి రాలేదు.

"""/" / అఖిల్ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వస్తుందా? రాదా? అనే ప్రశ్నలకు సైతం సమాధానం దొరకడం లేదు.

అఖిల్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాకపోతే మాత్రం అక్కినేని ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఏజెంట్ సినిమా దారుణ ఫలితం వల్ల ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో సోనీ లివ్ వెనక్కు తగ్గి ఉండవచ్చని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అఖిల్ లేదా ఏజెంట్ మేకర్స్ ఈ సినిమా గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అఖిల్ కు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.హీరో అఖిల్ పారితోషికం సైతం అంతకంతకూ తగ్గుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కొడుకు రాజమౌళికి భారీ షాకిస్తున్న విజయేంద్ర ప్రసాద్.. 450 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కించనున్నారా?