యంగ్ కమెడియన్స్ ని హీరోలుగా చేస్తున్న నాని! ఈ సారో మరో ప్రయత్నం

నేచురల్ స్టార్ నాని ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకడుగా తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

ఏకంగా 50 కోట్ల వరకు మార్కెట్ ని తన ఖాతాలో నాని వేసుకున్నాడు.

అతి తక్కువ టైంలో ఈ ఫీట్ సొంతం చేసుకున్న హీరోగా టాలీవుడ్ లో నాని ఉన్నాడు.

ఇక తాజాగా జెర్సీ సూపర్ సక్సెస్ తో వరుసగా రెండు ఫ్లాప్ ల తర్వాత మళ్ళీ జోష్ లోకి వచ్చాడు.

ఈ సినిమా ఇప్పుడు రికార్డ్ కలెక్షన్ తో దూసుకుపోతుంది.!--breakcontent ఇదిలా ఉంటే నాని మరో వైపు వాల్ పోస్ట‌ర్ సినిమాస్ బ్యాన‌ర్‌లో వరుస చిత్రాలు నిర్మించడానికి రెడీ అవుతున్నాడు.

తక్కువ బడ్జెట్ తో డిఫరెంట్ కంటెంట్ సినిమాలని తెరకెక్కిస్తూ నిర్మాతగా కూడా తన టేస్ట్ చూపించుకోవాలని నాని ఆసక్తి చూపిస్తున్నాడు.

అందులో భాగా త్వరలో ఓ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నాడు.అందుకు సంబంధించిన న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతోంది.

ఈలోగా మ‌రో సినిమానీ మొద‌లెట్టాల‌ని చూస్తున్నాడు.ఈసారి స్వ‌ప్న‌ద‌త్‌తో క‌ల‌సి ప్రొడ‌క్ష‌న్ లో పాలు పంచుకోబోతున్నాడ‌ని తెలుస్తోంది.

ఈ చిత్రంలో కమిడియ‌న్లు ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌లు క‌థానాయ‌కులుగా న‌టించ‌బోతున్నార‌ని స‌మాచారం.ఇదో పూర్తిస్థాయి వినోదాత్మ‌క చిత్ర‌మ‌ని, పిట్ట‌గోడ‌’ ద‌ర్శ‌కుడు అనుదీప్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు.

త్వరలో ఈ సినిమా ప్రారంభం అవుతుంది అని తెలుస్తుంది.

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పేరు మారిందా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమిదే!