పెళ్లి పేరుతో డాక్టర్ ను నిలువునా ముంచేసిన అమెరికా యువతి..!
TeluguStop.com
ఇటీవలే కాలంలో మోసాలు చేయడానికి కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూ, నిలువు దోపిడీ చేసేస్తున్నారు.
సుపరిచిత వ్యక్తుల తీయని మాటలను నమ్మి సులువుగా తమను తామే మోసం చేసుకుంటున్నారు.
ఇలాంటి కోవకు చెందిన ఓ సంఘటన పుదుచ్చేరిలో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మొదట ప్రేమ, తర్వాత పెళ్లి అంటూ ఓ డాక్టర్ ను పరిచయం చేసుకున్న అమెరికా యువతి( American Woman ) ఏకంగా రూ.
37 లక్షలు తస్కరించి నిలువునా ముంచేసింది.ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆ డాక్టర్( Doctor ) తాను మోసపోయిన విషయం గ్రహించి చివరకు పోలీసులను ఆశ్రయించాడు.
"""/" /
వివరాల్లోకెళితే పుదుచ్చేరిలో బాలాజీ (34) అనే డాక్టర్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు.
బాలాజీ రెండవ వివాహం చేసుకోవడం కోసం ఓ మ్యాట్రిమోనీ వెబ్సైట్లో( Matrimony Website ) తన బయోడేటా పెట్టాడు.
అయితే అమెరికాలో ఉండే సోము శ్రీనాయర్ అనే యువతి వెబ్సైట్లో వివరాలు చూసి బాలాజీ కు ఫోన్ చేసింది.
ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.ఇక రోజు ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకోవడం, చాటింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు.
"""/" /
ఇద్దరి అభిప్రాయాలతో పాటు మనసులు కూడా కలవడంతో వివాహం చేసుకొని ఒక్కటవ్వాలి అనుకున్నారు.
ఇక వీరి ప్రేమ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్న క్రమంలో ఆ యువతి హఠాత్తుగా ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయని, తనకు సహాయం చేసి గట్టెక్కించాలని కోరింది.
అందుకు డాక్టర్ కాబోయే భార్యను కష్టాల్లో నుంచి గట్టెక్కించేందుకు రెండు దఫాలుగా మొత్తం రూ.
37 లక్షలు అందించాడు.ఆ యువతికి డబ్బు అందిన నాలుగైదు రోజుల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.
ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది.అంతేకాకుండా సామాజిక మధ్యమాలలో కూడా ఆమె బ్లాక్ చేసి ఉండడంతో తాను మోసపోయానని గ్రహించిన డాక్టర్ చేసేదేమీ లేక చివరకు పోలీసులను ఆశ్రయించాడు.
స్వయంభు సినిమా ఎలా ఉండబోతుంది..? నిఖిల్ సక్సెస్ కొడుతాడా..?