ప్రళయ దినాన ఈ ప్రశ్నకు జవాబు చెప్పనిదే.. దేవుడి ముందు నుంచి కదలలేరా..?

ముఖ్యంగా చెప్పాలంటే ఏ ధర్మంలోనైనా అన్యాయమైన సంపాదనను, వేరొకరి సొత్తును అధర్మంగా తీసుకోడాన్ని నిషేధించారు.

మనిషి డబ్బు సంపాదించడాన్ని అల్లాహ్( Allah ) ఒక పరీక్షగా నిర్ధారించాడు.సంపాదనలో పూర్తి స్వేచ్ఛను ప్రసాదించాడు.

మానవుడు ధర్మ సమ్మతమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించవచ్చు.లేదా ఈ భూమి పై అధర్మమైన దారుల్లో ధనరాశిని కూడా పెట్టవచ్చు.

అయితే ప్రళయ దినం( Doomsday ) రోజు అల్లాహ్ ఎదుట హాజరై జవాబు చెప్పవలసి ఉంటుంది.

ఇహ లోకంలో ఆచరించిన నమాజ్ ల గురించి, ఉపవాసాల గురించే కాదు మానవ ప్రపంచంలో నువ్వు డబ్బు ఎలా సంపాదించావు, ఎలా ఖర్చు చేశావు అని కూడా అల్లాహ్ ప్రశ్నిస్తాడు.

"""/" / అలాగే ప్రళయదినన అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఏ వ్యక్తి అక్కడి నుంచి కదలలేడు అని మహా ప్రవక్త మహమ్మద్ స్పష్టం చేశారు.

విశ్వాసులారా! ఒకరి సొమ్మును మరోకరు అధర్మంగా తినకూడదు.పరుల మీద హింస దౌర్జన్యాలకు పాల్పడే వాళ్ళు తప్పకుండా అగ్నిలో పడతారు.

నిషేధితమైన మహా పాపాలకు( Sins ) దూరంగా ఉండే వారిలో చిన్న చిన్న దోషాలు ఉన్నా అల్లాహ్ వాటిని లెక్కనుంచి తొలగిస్తాడు.

వీరిని స్వర్గంలో గౌరవనీయ స్థానాలలో ప్రవేశింప చేస్తాడని దివ్య ఖురాన్ లో( Quran ) ఉంది.

తప్పుడు సంపాదనతో పోషించిన శరీరం స్వర్గంలో ప్రవేశించలేదు. """/" / అలాగే చెడ్డ సంపాదన సత్కార్యాలను నాశనం చేస్తుంది.

ఇహ లోక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.అలాంటి వ్యక్తి చేసే ప్రార్థనలను( Prayers ) అల్లాహ్ అంగీకరించడు.

మనిషి అన్ని సమయాలలో, అన్ని కార్యక్రమాలలో నిస్సహాయుడు.ప్రతి విషయంలో అతనికి అల్లాహ్ సహాయం తప్పకుండా అవసరమవుతుంది.

అప్పుడు చేతులెత్తి అల్లాహ్ ను వేడుకుంటాడు.కరుణామయుడైన అల్లాహ్ తన ప్రతి భక్తుడి ప్రార్థనలను ఆలకిస్తాడు.

అతని అవసరాలను తీర్చుతాడు.కానీ ఎవరైతే అక్రమమైన ధనాన్ని( Money ) కలిగి ఉంటాడారో, బంధుత్వపు సంబంధాలను డబ్బు కోసం తెంచుకుంటారో అలాంటి వ్యక్తి వైపు అల్లాహ్ ఎన్నటికీ చూడడు.

అలాంటి వారు ఎన్ని ప్రార్థనలు చేసిన వృధానే అని మహా ప్రవక్త చెబుతున్నారు.

శేఖర్ కమ్ముల కుబేర సినిమాలో నటించనున్న స్టార్ హీరోయిన్…