గోర్లు కొరకడం అలవాటుగా ఉందా..?! అయితే ఈ సమస్యలు తప్పవు..!
TeluguStop.com
కొంతమంది అస్తమానం గోళ్లు కొరుకుతూ ఉండడం మనం గమినించే ఉంటాము.వాళ్ళకి అలా చిన్న వయసులోనే అలవాటు అయిపోవడం వల్ల పెద్ద అయ్యాక కూడా దానిని ఒక అలవాటుగా మార్చుకున్నారు.
అలా ఏదన్నా టెన్షన్ లో ఉన్నప్పుడు గాని, టీవీ లో ఏదన్నా చూస్తున్నప్పుడు గాని ఇలా గోళ్లు కొరకడం సర్వ సాధారణం.
అయితే ఇలా గోళ్లను కొరికి,వాటిని నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఇలా గోళ్లు కొరికి వాటిని తినడం వలన ఎన్ని అనారోగ్యాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
!
గోళ్లను కొరకడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు.చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
చర్మం ఎర్రగా అయిపోవడం, వాపులు రావడం మొదలైనవి వస్తాయి.అలాగే ప్రతి రోజు మీరు ఇలా గోళ్లను కొరుకుతూ ఉన్నట్లయితే మీ గోళ్లు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి.
అలాగే నోట్లో ఉన్న పళ్ళకి నష్టం కలుగుతుంది.అంతే కాదండి తరచు కొరకడం వల్ల వంగి పోతాయి.
"""/" /
ఒక్కోసారి గోళ్లను కోరినప్పుడు అవి దంతాల్లో ఇరుక్కుపోతాయి.అప్పుడు దంతాల నుంచి రక్తం కారడం లాంటి సమస్యలకు దారి తీస్తుంది.
తద్వారా దంతాలలో నొప్పి వస్తుంది.ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనం గోళ్లను కొరికినప్పుడు ఆ గోళ్ళల్లో ఉండే మట్టి అనేది నోటి ద్వారా కడుపులోకి ప్రవేశిస్తుంది.
ఫలితంగా నోట్లో బాక్టీరియా చేరినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ కడుపులోకి వెళ్లి పోతుంది.
దీని కారణంగా జీర్ణ సంబంధిత వ్యాధులు వస్తాయి.అంటే తరుచు ఇన్ఫెక్షన్ కి లోను అవ్వడం వలన కడుపులో నొప్పి రావడం జరుగుతుంది.
చూసారు కదా అస్తమానం గోళ్లను కోరుక్కుంటూ ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో.
మరి ఇక నుంచి అయిన జాగ్రత్త వహించండి.!!.
అరె ఏంటి భయ్యా.. ఈ బల్లి ఇంత వెరైటీగా ఉంది (వీడియో)