రిజర్వ్ బ్యాంక్ గోల్డ్ నిల్వలు ఎక్కడ ఉంటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఇండియాలో బంగారం నిల్వలు పెరిగిపోయాయి అనేది వాస్తవం.ప్రస్తుతం మన దేశంలో ఉన్న నిల్వలను బట్టి అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాల్లో తొమ్మిదవ దేశంగా ఇండియా నిలుస్తోంది.

అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాత్రం కొనుగోలు చేసిన బంగారాన్ని తన దగ్గర కాకుండా ఇతర దేశాల్లో నిలువ చేస్తోంది.

"""/"/ 2022 రిజర్వ్ బ్యాంక్ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియాలో సుమారు 754 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.

మరో విశేషమేంటంటే, ఏప్రిల్ 2022 నుంచి సెప్టెంబర్ 2022 మధ్య కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఏకంగా 132.

34 టన్నుల గోల్డ్ కొనుగోలు చేసింది.నిజానికి ప్రపంచంలో ఈ స్థాయిలో ఏ బ్యాంకు కూడా బంగారం కొనుగోలు చేయలేదు.

ఆ విధంగా చూసుకుంటే 2022 లో ఆర్‌బీఐ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం కొనుగోలు కేంద్ర బ్యాంకుగా నిలుస్తోంది.

దీనికి ముందు అంటే 2021వ సంవత్సరంలో ఆర్‌బీఐ బంగారం ఎక్కువగా కొనుగోలు చేయడంలో మూడో స్థానంలో ఉంది.

ఇక 2020లో ఆర్‌బీఐ జస్ట్ 41.68 టన్నుల గోల్డ్ మాత్రమే కొనుగోలు చేసింది.

"""/"/ ఇక అసలు విషయానికొస్తే ఇలా కొనుగోలు చేసిన బంగారాన్ని భారతదేశంలో కంటే ఇతర దేశాల్లోనే ఆర్‌బీఐ నిల్వ చేస్తుంది.

2022 మార్చి చివరి నాటికి, రిజర్వ్ బ్యాంక్ 11.08 టన్నుల బంగారు డిపాజిట్లతో సహా 760.

42 టన్నుల బంగారాన్ని కలిగి ఉంది.అయితే ఆర్‌బీఐ ప్రకారం, ఆ బంగారం నిల్వల్లో 296.

48 టన్నుల బంగారం ఇండియాలో ఉంచగా.447.

30 టన్నుల బంగారం విదేశీ బ్యాంకుల్లో ఉంచడం జరిగింది.ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో ఎక్కువగా గోల్డ్ నిల్వలు ఉన్నట్లు తెలిపింది.

ఇక కొన్ని టన్నుల బంగారం స్విట్జర్లాండ్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్ వద్ద సేఫ్‌గా దాచి పెట్టారట.

ఇదిలా ఉండగా బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది.

ప్రపంచ దేశాల ఉంచిన మొత్తం బంగారంలో సుమారు 75 శాతం అమెరికాలోనే ఉంది.

ప్రభాస్ కి అసలైన పోటీ ఇచ్చే స్టార్ హీరోలు వీళ్లేనా..?