పచ్చిమిర్చితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే షాక్ అవుతారు..!

సాధారణంగా పచ్చి మిరపకాయలను( Green Chillies ) ప్రతి వంటకాలలో కారం కోసం ఉపయోగిస్తూ ఉంటాం.

అయితే కొందరు వీటిని పచ్చిగానే తింటూ ఉంటారు.అయితే నశాలని కంటే కారం ఉండే పచ్చి మిరపకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చాలామందికి తెలిసి ఉండదు.

పచ్చిమిర్చి చాలా రకాల వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.అంతేకాకుండా పచ్చిమిర్చి ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

అయితే ఆ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే పచ్చిమిర్చి అంటే తినని వారు కూడా వారి నిర్ణయాన్ని మార్చుకుంటారు.

ఇది శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. """/" / అయితే పచ్చి మిరపకాయలు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పచ్చి మిరపకాయల్లో విటమిన్ సి( Vitamin C ) అధికంగా ఉంటుంది.అంతేకాకుండా ఇందులో బీటా కెరోటిన్( Beta Carotene ) కూడా ఉంటుంది.

ఈ రెండు పోషకాలు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి.ఇది చర్మం మెరుపు, దృఢత్వం, మంచి శరీర ఆకృతిని నిర్వహించడానికి సహాయపడుతుంది.

పచ్చి మిరపకాయల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.ఇది మన శరీరంలో రక్త ప్రసరణ ను పెంచడంలో ఉపయోగపడుతుంది.

అలాగే ఇది శరీరానికి శక్తిని ఇచ్చి శరీరం చురుగ్గా పనిచేసేలా కూడా చూస్తుంది.

"""/" / క్యాప్సైసిన్( Capsaicin ) అనే పదార్థం పచ్చి మిరపకాయల్లో లభిస్తుంది.

ఇది మెదడులోని హైపోథలమస్ శీతాళీ కరణ( Hypothalamus Cooling ) కేంద్రాన్ని చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది.

దీని వలన శరీర ఉష్ణోగ్రత కూడా అదుపులో ఉంటుంది.రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

పచ్చి మిరపకాయలో విటమిన్ సి ఉండడం వలన శరీరానికి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

అలాగే ఇన్ఫెక్షన్ల నుండి ఇది మన శరీరాన్ని రక్షిస్తుంది.పచ్చి మిరపకాయల్లో ఉన్న ఆంటీ ఆక్సిడెంట్స్ వలన జలుబు, దగ్గు లాంటి సమస్యలకు ఇది మంచి దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

అరటిపండు ఆరోగ్యాన్నే కాదు జుట్టును పెంచుతుంది.‌. తెలుసా?