ఎన్టీఆర్ ఫ్యాన్ చేసిన పని తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. తారక్ ను చూడాలని 300 కిలోమీటర్లు నడిచాడా?

మాములుగా అభిమానులు హీరో హీరోయిన్ ల కోసం వారి మీద ఉన్న అభిమానంతో రక్తదానం, అన్న దానం వంటి మంచి పనులతో పాటుగా వారికోసం కిలో మీటర్లు నడవడం వారి పేరు వారి ఫోటోలు టాటూలు వేయించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.

ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు హీరో హీరోయిన్ లను కలవడం కోసం అభిమానులు పాదయాత్ర కూడా చేస్తూ ఉంటారు.

తాజాగా కూడా ఎన్టీఆర్ ( NTR ) కోసం అభిమాని పాదయాత్ర చేసి, తన ఫేవరెట్ హీరోని కలుసుకున్నాడు.

"""/" / ఖమ్మం జిల్లాలోని తిరుమలాయ పాలెం మండలం గోపాయిగూడెం గ్రామానికి చెందిన నాగేంద్రబాబు ఎన్టీఆర్ కి వీరాభిమాని.

ఎన్టీఆర్ ను కలవడం కోసం ఖమ్మం( Khammam ) జిల్లా నుంచి హైదరాబాద్ ( Hyderabad )కు చెప్పుల్లేకుండా పాదయాత్ర చేశాడు.

300 కిలో మీటర్ల ఈ పాదయాత్ర తొమ్మిది రోజుల పాటు సాగింది.అసలే వేసవి కాలం కావడం, పైగా చెప్పుల్లేకుండా పాదయాత్ర చేయడంతో నాగేంద్ర బాబు(Nagendra Babu) కాళ్లకు బొబ్బలు కూడా వచ్చాయి.

అయినప్పటికీ అతను వెనకడుగు వేయలేదు.ఎండని లెక్క చేయకుండా పాదయాత్ర చేసి, ఎన్టీఆర్( NTR ) నివాసానికి చేరుకున్నాడు.

"""/" / ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో నటిస్తున్నారు.

ఈ సినిమాతో పాటు వార్ 2 ( War 2 )లో కూడా నటిస్తున్నారు.

అయితే సరిగ్గా వార్ 2 మూవీ షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లిన సమయంలోనే నాగేంద్రబాబు పాదయాత్ర చేస్తూ ఆయన నివాసానికి చేరుకున్నాడు.

హీరో ఇంట్లో లేడని తెలిసినా ఆ అభిమాని ఏమాత్రం నిరాశ చెందలేదు.హీరో రాక కోసం రెండు వారాల పాటు ఆయన ఇంటి ముందే ఎదురుచూశాడు.

అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ముంబై నుంచి రాగానే తన అభిమాని నాగేంద్రబాబుని కలిసి ఆప్యాయంగా పలకరించాడు.

అతనితో కలిసి ఫొటోలు దిగాడు.మొత్తానికి, తన అభిమాన హీరోని కలిసి ఫొటో దిగాలన్న కోరిక నెరవేరడంతో నాగేంద్రబాబు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

ఆంటీని పలుమార్లు కత్తితో పొడిచిన పదహారేళ్ల కుర్రాడు.. ఎందుకో తెలిస్తే..