Premi Vishwanath : వంటలక్క కుక్క పేరు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. భలే క్రేజీగా ఉందిగా!
TeluguStop.com
కొంతమంది పెంపుడు జంతువులను బాగా ఇష్టపడుతూ ఉంటారు.ముఖ్యంగా చిన్న చిన్న కుక్కపిల్లను పెంచుకుంటూ ఉంటారు.
చాలావరకు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు( Celebrities ) కుక్కలను పెంచుకోవడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు.
ఇక ఎప్పుడు వాటిని తమ వెంటే తీసుకెళ్తూ ఉంటారు.సొంత మనుషుల కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు.
వాటి ఫుడ్ విషయంలో కూడా చాలా కేరింగ్ తీసుకుంటూ ఉంటారు.వాటికి పెట్టే పేర్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.
కొన్నిసార్లు ఆ పేర్లు వింటుంటే బాగా క్రేజీగా ఉంటాయి.అయితే తాజాగా వంటలక్క కుక్క పేరు కూడా బాగా వైరల్ అవుతుంది.
ఇంతకు ఆ కుక్క పేరు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.వంటలక్క అనగానే మనకు గుర్తుకు వచ్చే సీరియల్ కార్తీకదీపం( Serial Karthikadeepam ).
కొన్ని నెలల కిందట ఈ సీరియల్ ముగిసిన సంగతి తెలిసిందే.ఇక ఈ సీరియల్ ముగింపు పలికిన కూడా ప్రేక్షకులు మాత్రం ఈ సీరియల్ లో నటించిన నటీనటులను మర్చిపోలేక పోతున్నారు.
ముఖ్యంగా వంటలక్క పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాధ్.ఈమె కేరళకు చెందిన మలయాళ నటి.
అక్కడ ఎన్నో సినిమాలలో, సీరియల్స్ లో చేసి మంచి పేరు సంపాదించుకుంది. """/" /
ఇక ఈమెకు రెండు నిర్మాణ సంస్థలు( Two Construction Companies ) కూడా ఉన్నాయి.
ఒక వైపు నటిగానే కాకుండా మరోవైపు బిజినెస్ ఉమెన్ గా కూడా బాగా బిజీ బిజీగా ఉంటుంది.
ఇక కార్తీకదీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈ సీరియల్ తో ఎంతో మంది అభిమానుల మనసులను గెలుచుకుంది.
ఇక ఈ సీరియల్ తో మంచి పాపులారిటీని సంపాదించుకుంది.ఇక ఆ మధ్యనే నాగచైతన్య నటించిన కస్టడీ మూవీలో( Custody Movie ) కనిపించి అందరికీ సర్ప్రైజ్ చేసింది.
ఈమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.తెగ ఫోటోలు షేర్ చేస్తూ బిజీగా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తనను షూట్ చేసుకున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.ఏదైనా ఫోటో షేర్ చేస్తే చాలు అది క్షణాల్లో వైరల్ అవుతుంది.
అప్పుడప్పుడు తను వెస్ట్రన్ డ్రెస్ లో ఉన్న ఫొటోస్ కూడా బాగా వైరల్ అవుతూ ఉంటాయి.
"""/" /
ఏదైనా ఈవెంట్ సమయంలో బుల్లితెరపై బాగా సందడి చేస్తుంది.తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందర్నీ ఆకట్టుకుంటుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక స్టోరీ పంచుకుంది.అందులో తను జీన్స్ ధరించి స్టైలిష్ లుక్ లో కనిపించింది.
అంతేకాకుండా అందులో తను చిన్న కుక్క పిల్లని ఎత్తుకున్నట్లు కనిపించింది.ఇక ఆ కుక్క పిల్ల పేరు 'మీకు' అని చెప్పుకొచ్చింది.
దానికి సపరేట్ గా ఇంస్టాగ్రామ్ ఖాతా కూడా క్రియేట్ చేసింది.అయితే ఆ కుక్క పిల్ల పేరు ప్రస్తుతం బాగా వైరల్ అవ్వటంతో.
ఆ పేరు భలే క్రేజీగా ఉంది అంటూ వంటలక్క అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
భర్తను అన్ ఫాలో చేసిన కలర్స్ స్వాతి…. మరోసారి తెరపైకి విడాకుల వార్తలు?