ఇకపై యూట్యూబ్‌లో ఆ వీడియోలు ఉండవట

యూట్యూబ్‌ ఓపెన్‌ చేస్తే చాలు ఏదో ఆసక్తి రేకెత్తించే థమ్‌నైల్‌తో టైటిల్‌తో వీడియో ఉంటుంది.

తీరా ఆ వీడియోను ఓపెన్‌ చేస్తే మ్యాటర్‌ ఏమీ ఉండదు.మొదట ఇలాంటి వీడియోలను ఎక్కువ మంది చూసేవారు.

కాని మొత్తం అవ్వే అవుతున్న కారణంగా ఆ వీడియోలను నమ్మడమే జనాలు మానేశారు.

అలాంటి ఫేక్‌ టైటిల్స్‌ వల్ల జనాలు చిరాకు పడుతున్నారనుకుంటున్న యూట్యూబ్‌ యాజమాన్యం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది.

ఆ నిర్ణయంతో ఇకపై అలాంటి పుల్కా వార్తలు ఉండబోవు.యూట్యూబ్‌ వారు భాషకు ఒక టీం తయారు చేసి పెద్ద ఎత్తున యూట్యూబ్‌లో పోస్ట అవుతున్న వీడియోలపై పర్యవేక్షణ పెట్టబోతుంది.

టైటిల్‌ మరియు వీడియోకు సంబంధం లేకున్నా లేదంటే పుకారును క్రియేట్‌ చేసినా కూడా ఆ వీడియోను వెంటనే తొలగించడంతో పాటు ఆ వీడియో క్రియేటర్‌కు వార్నింగ్‌ మెసేజ్‌ను పంపించబోతున్నారు.

యూట్యూబ్‌లోని కంటెంట్‌ను నమ్మశక్యంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా యూట్యూబ్‌ ఇండియా ప్రతినిధి అన్నారు.

ఇకపై యూట్యూబ్‌లో జన్యూన్‌ కంటెంట్‌ మాత్రమే ఉండబోతుందన్నమాట.

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. సీఎం జగన్ హాట్ కామెంట్స్